ఇటీవల కాలంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ముఖ్యంగా గుండె పోటుతో మరణిస్తున్న వారు లెక్కకు మిక్కిలిగా పెరుగుతున్నారు.
అందుకే గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు.అయితే గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాలు కొన్ని ఉన్నాయి.
వాటిలో కొబ్బరి పాలు ఒకటి.
ముఖ్యంగా కొబ్బరి పాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ గుండె పది కాలాల పాటు పదిలంగా ఉండటం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందు రెండు గిన్నెలు తీసుకుని ఒకదాంట్లో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు, మరొక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి.
ఆ తర్వాత రెండు గిన్నెల్లో వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే బ్లెండర్ తీసుకుని అందులో ఐదు నానబెట్టుకుని పొట్టు తొలగించిన బాదం పప్పు, సోంపు గింజలు మరియు గసగసాలు వేసుకోవాలి.అలాగే అందులో నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్ మరియు ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న డ్రింక్ ను డైరెక్ట్ గా తీసుకోవాలి.
రోజులో ఏ సమయంలో అయినా ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు.కొబ్బరి పాలను ఈ విధంగా గనుక తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.వివిధ రకాల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అంతేకాదు కొబ్బరి పాలను పైన చెప్పిన విధంగా తీసుకుంటే ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి.బరువు తగ్గుతారు.
కీళ్ల నొప్పుల సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.