యాదాద్రి జిల్లా:దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కేసీఆర్ సుపారి తీసుకున్నాడని, పది రోజులపాటు ఢిల్లీలో ఉండి అమిత్ షా నరేంద్ర మోడీతో రహస్యమంతనాలు జరిపి వచ్చాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నన్ను ఒంటరిని చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు.పీసీసీ పదవి కోసం ఇంత కక్ష పూరితంగా ఉంటారా అని ఉద్వేగానికి లోనయ్యారు.
కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికని అన్నారు.కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలతో మునుగోడును చుట్టిముట్టి ప్రజలను,కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర పోలీసులు కేసీఆర్ కు కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం, దివిసీమలాగా మన రాష్ట్రం కాకూడదన్నారు.లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యదక్షులు ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు మునుగోడుకు తరలిరండి మన పార్టీని కాపాడుకుందాం పార్టీని కాపాడుకుందాం అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి రేవంత్ రెడ్డిని పిసీసీ నుండి తొలగించాలని భారీ కుట్ర జరుగుతుందని, కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ గమనించాలన్నారు.రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే సొంత పార్టీ నాయకులు కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నారని,తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రండి,కదలిరండి పోరాడుదాం పార్టీని గెలిపిద్దాం స్రవంతికి,అండగా ఉందాం మనకు అన్నం పెడుతున్న మునుగోడును అంటూ ఎవరూ చింతించకండి,పోలీసుల లాఠీల దెబ్బలకు ఎవరు భయపడొద్దు,ప్రాణాలైనా ఇద్దాం కాంగ్రెస్ పార్టీని బతికిద్దాం.లాఠీలైనా తుపాకీ తూటాలైనా ఎదురు ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్న, ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని బాధాతప్త వ్యాఖ్యలు చేశారు.
పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తా కార్యకర్తలకు,పార్టీ శ్రేణులకు, మునుగోడు ప్రజలకు తెలిపారు.రెండు అధికార పార్టీలు డబ్బులతో గెలుద్దామని చూస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు.ప్రజలారా ఆలోచించండి అవకాశం ఇవ్వండి మునుగోడు ప్రజలకు విన్నపం చేశారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టాలి.ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కుట్రలు చేస్తున్న రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అభిమానులారా సోనియాగాంధీ అభిమానులారా రాహుల్ గాంధీ అభిమానులారా ఇందిరా గాంధీ అభిమానులారా ఆలోచించండి కదలిరండి మునుగోడుకు అని పిలుపునిచ్చారు.పిసిసిగా నన్ను తొలగించేందుకే సొంత పార్టీ నాయకులు భారీ కుట్ర చేస్తున్నారు.
నాకు పిసిసి శాశ్వతం కాదు.సోనియాగాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమే.
పదవులు ఎవరికి శాశ్వతం కాదు.పిసిసి పదవి వచ్చిన కానుండి నాపై కేసీఆర్,బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
మునుగోడు ప్రజలారా ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పోరాటం చేస్తా రెండు ప్రభుత్వాలను తిప్పికొడుతూ కార్యకర్తల కోసం పార్టీ కోసం ప్రాణాలైనా ఇద్దాం సిద్ధమా,సిద్ధమా అని రేవంత్ రెడ్డి కార్యకర్తలను అడిగారు.