టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కృష్ణ వారసుడిగా అడుగుపెట్టిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా హీరోగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన మహేష్ బాబు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఇందిరా దేవి మరణించడంతో మహేష్ బాబు ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తన తల్లితో మహేష్ బాబుకి ఎంతో మంచి అనుబంధం ఉందని ఆయన సినిమా విడుదలైన ప్రతిసారి తన తల్లి దగ్గరకు వెళ్లి ఆమె చేతి కాఫీ తాగే వారంటూ ఎన్నోసార్లు తన తల్లితో ఉన్న అనుబంధం గురించి బయట పెట్టారు.
ఇక ఇందిరా దేవి మరణించిన తరువాత ఆమెకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందిరా దేవి మహేష్ బాబు నటించిన ప్రతి ఒక్క సినిమాని కూడా చూసేవారట అయితే ఆమె మహేష్ బాబు నటించిన సినిమాలలో నిజం సినిమాని ఏకంగా ఓ వంద సార్లు చూసి ఉంటారని తెలుస్తోంది.నిజం సినిమాలో మహేష్ బాబు నటించిన ఎంతో అమాయకంగా ఉంటుంది.
తల్లి చెప్పే ప్రతి ఒక్క మాటను తప్పకుండా పాటించే కొడుకు పాత్రలో మహేష్ బాబు నటించారు.
ఇలా ఎంతో అమాయకంగా మహేష్ బాబు ఈ సినిమాలో నటించడంతో ఇందిరా దేవికి ఈ సినిమా అంటే ఎంతో ఇష్టంగా మారిపోయింది.అందుకే ఈమె నిజం సినిమాని తరచూ చూస్తూ తన కొడుకు అమాయకత్వాన్ని చూసి నవ్వుకునేవారట.ఇలా మహేష్ బాబు ఇందిరా దేవి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడి ఉంది.
అయితే కొంతకాలం నుంచి ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సెప్టెంబర్ 28వ తేదీ తుది శ్వాస విడిచారు.ఇక మహేష్ బాబు కొడుకుగా తన తల్లికి చేయాల్సిన కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేశారు.