ప్రస్తుతం ఏ భాషలో చూసినా కాంతార సినిమా పేరు వినపడుతుంది.కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా కన్నడ భాషలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని వివిధ భాషలలో డబ్ చేసి విడుదల చేశారు.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే కాంతార సినిమా చూసినటువంటి అనుష్క శెట్టి ధనుష్ ప్రభాస్ కార్తీ వాటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందిస్తూ పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే ఈ సినిమా విజయం పట్ల ఇప్పటివరకు కన్నడ నటి రష్మిక మందన్న ఏమాత్రం స్పందించకపోవడంతో కన్నడ ప్రేక్షకులు రష్మిక మందన్న పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆమెను నేడు ఈ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు సినిమా విడుదలై మంచి హిట్ అయితే కనీసం తనకు శుభాకాంక్షలు చెప్పే తీరిక కూడా రష్మికకు లేదా అంటూ మండిపడుతున్నారు.
రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి నటించిన కిరిక్ పార్టీ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు.ఈ క్రమంలోనే తనకు ఎంతో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో కనీసం రష్మిక ఈ సినిమా పై స్పందించి శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు.ఇక రష్మిక కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టి నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.