సీబీఐ విచారణ అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.లిక్కర్ స్కామ్ గురించి సీబీఐ పెద్దగా ఏమి అడగలేదు అన్నారు.
ఆప్ నుంచి బయటకు రావాలంటూ ఒత్తిడి తెచ్చారు.లేకపోతే ఈ కేసు ఇలానే కొనసాగుతుందని బెదిరించారు అని వెల్లడించారు.
దీనికి బీజేపీలో చేరేది లేదని చెప్పా అని స్పష్టం చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన వ్యక్తిగా సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అయితే బీజేపీ కుట్ర పూరితంగా గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లనివ్వకుండా అడ్డుకొంటున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.