హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది.మెట్రో సర్వీస్ వేళలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి.ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలు అందుతున్న సంగతి తెలిసిందే.కాగా పొడిగించిన కొత్త సమయాలు ఈనెల 10 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు.