తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఎస్ఎస్ తమన్.ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్ హవ కొనసాగుతుంది.
ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన తమన్ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమా విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో భాగంగా తమన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఎన్నో రకాల సెంటిమెంట్ లు ఉంటాయి.
పలానా తేదీలోనే సినిమా ప్రారంభం కావాలని ఫలానా తేదీలో విడుదలవుతే మంచి హిట్ అవుతాయంటూ ఎన్నో రకాల సెంటిమెంట్లు ఉంటాయి.ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కిసైతం అలాంటి సెంటిమెంట్ ఉందని ఇప్పటికే ఆ సెంటిమెంట్ పలువురు హీరోల సినిమా విషయంలో వర్కౌట్ అయిందని, తాజాగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ విషయంలో కూడా తన సెంటిమెంట్ వర్క్ అవుట్ అయిందని తెలియజేశారు.
తాను మొదటిసారి ఏ హీరో సినిమా చేసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అవుతుందనే సెంటిమెంట్ తమన్ కి ఉంది.
ఇప్పటికే ఆయన మహేష్ బాబుతో మొదటిసారిగా దూకుడు సినిమా చేశారు.అలాగే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, రవితేజతో కిక్ సినిమా చేశారు.అదేవిధంగా బాలకృష్ణ అఖండ, ఎన్టీఆర్ బృందావనం వంటి సినిమాలకు మొదటిసారి సంగీతం అందించారని అయితే ఈ సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయని తెలిపారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి మొదటిసారిగా గాడ్ ఫాదర్ సినిమాకు సంగీతం అందించారని ఈ సినిమా కూడా మంచి హిట్ అయిందని ఈ సందర్భంగా తమన్ తెలియజేశారు.ప్రస్తుతం తమన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.