అమెరికాలో ఏళ్ళ తరబడిగా ఉంటూ అక్కడి శాశ్వత పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న ఎన్నారైలకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది.గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియని వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
కేవలం 6 నెలలలో గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియని పూర్తి చేయాలని బిడెన్ అధ్యక్ష్యతన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.ఇదేగానుకా త్వరలో అమలైతే అమెరికాలో ఉంటున్న భారతీయులకు భారీగా లబ్ది చేకూరనుందని అంటున్నారు పరిశీలకులు.
ప్రవాసుల కు సంభందించిన విధి విధానాలను పర్యవేక్షించే అడ్వైజరీ కమిషన్ ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు తీసుకువచ్చిందట.ఈ ప్రతిపాదనలను తాజాగా వైట్ హౌస్ లో ఉండే డొమిస్టిక్ పాలసీ కౌన్సిల్ కు పంపింది.
వీటిని పర్యవేక్షించిన కౌన్సిల్ అందులోని ప్రతిపాదనలను క్షుణంగా పరిశీలించి అధ్యక్షుడి నిర్ణయానికి పంపుతుంది.ఈ ప్రతిపాదనలను ఒక వేళ బిడెన్ గనుకా ఒప్పుకుంటే ఏళ్ళ తరబడి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న ఎన్నారైలకు భారీ ప్రయోజనం కలుగుతుంది.
ఇదిలాఉంటే.
2021 ఏడాదికి గాను మొత్తం 226000 గ్రీన్ కార్డ్ లు అందుబాటులోకి రాగా అందులో కేవలం 65 వేల గ్రీన్ కార్డ్ లు జారీ అయ్యాయని ఓ నివేదిక వెల్లడించింది.అయితే అంత తక్కువ మొత్తంలో గ్రీన్ కార్డ్స్ జారీపై ప్రవాసులు పెదవి విరిచారు అంతేకాదు అమెరికా ప్రభుత్వానికి వినతులు కూడా వెల్లువెత్తాయి.దాంతో స్పందించిన అమెరికా నేషనల్ వీసా సెంటర్ ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది.
అంతేకాదు ఆగస్ట్ 2022 మొదటి మూడు నెలల్లో జారీ అయిన గ్రీన్ కార్డ్స్ కంటే కూడా అత్యధికంగా రెండింతలు గ్రీన్ కార్డ్స్ జారీ చేయాలని సూచించిందిఅంతేకాదు 2023 లోగా ఒకటిన్నర రేట్లు ఎక్కువగా గ్రీన్ కార్డ్స్ జారీ అయ్యింది లేనిది వెల్లడించాలని ఆదేశించింది.