చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా టీజర్ రిలీజ్ అయింది.ఇందులో చిరంజీవి లుక్ చూసాక కొంతమంది ఆహా ఓహో అంటుంటే మరి కొంతమంది డీలపడ్డారు.
ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది చాలు అభిమానుల్లో ఆనందానికి హద్దులు ఉండేవి కాదు.కానీ ఇటీవల కాలంలో చప్పగా సాగుతున్న చిరంజీవి సినిమాలు చూసి ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇకనైనా ఆయన మంచి సినిమా తీసి అభిమానులం దాహాన్ని తీర్చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.కానీ గాడ్ ఫాదర్ టీజర్ కూడా పెద్దగా అద్భుతంగా ఉన్నట్టుగా కనిపించడం లేదంటూ ఒక వర్గం అభిమానులు భావిస్తున్నారు.
ఎప్పుడు చిరంజీవి కోసం ఎవరో ఒకరు సినిమాలో చనిపోతూ త్యాగం చేయాల్సిందేనా అంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.ఒకప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు అందులో చనిపోయే పాత్ర నటుడు అచ్యుత్ చేయడం బాగా అలవాటుగా ఉండేది.
ఇప్పుడు ఆ పాత్ర కోసం సత్యదేవ్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.సత్యదేవ్ మధ్యలోనే చనిపోయి చిరంజీవికి హిట్ ఇస్తాడో లేదో తెలియదు కానీ ఇలా ఎవరో ఒక టాలీవుడ్ హీరో చనిపోవాల్సిందేనా అంటూ అభిమానులు పెడుతున్నారు.

ఇటీవల విడుదలైన ఆచార్య సినిమాలోను రాం చరణ్ మధ్యలోనే చనిపోతాడు.మరి ఇలా హీరో చనిపోతే తప్ప చిరంజీవికి హిట్టు దొరకదా అని సగటు సినిమా ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు.గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ తో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ సాగుతోంది.మరోవైపు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గ్రాఫిక్స్ లో కనిపించడంతో ఆచార్య సినిమా ఫలితాన్ని అభిమానులు ఈ చిత్రం విషయంలో మళ్ళీ రుచి చూడాల్సిందే అంటూ గట్టిగా చెబుతున్నారు.
ఆ చిత్రంలో సైతం చిరంజీవి యంగ్ లుక్ కోసం ప్రయోగాలు చేయగా అది బెడిసికొట్టింది.ఈ సినిమా విడుదల ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.ఇక ఈ సినిమా కాకుండా మరో 3 సినిమాలతో లైన్ లో ఉన్నాడు చిరంజీవి.