టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందున్న ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.ఇటీవలే పుష్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ను పాపులారిటీని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
ఇకపోతే ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ఇప్పటికే మిషన్ మజ్ను సినిమా పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉంది.
తదుపరి ప్రాజెక్టు గుడ్ బై సినిమాలో నటించగా ఈ సినిమా కూడా తాజాగా పూర్తి అవడంతో ఈ సినిమా యూనిట్ కు కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.గుడ్ బై సినిమాకు గుడ్ బై చెప్పడం తనకు ఇష్టం లేదు అంటూ ఈ ముద్దుగుమ్మ తన పోస్టులో రాసుకొచ్చింది.
గుడ్ బై సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని, రెండేళ్లుగా కరోనా మహమ్మారి తో పాటు ఏది కూడా తమను పార్టీ చేసుకోకుండా అడ్డుకోలేకపోయింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది.అలాగే గుడ్ బై సినిమా చాలా కామెడీగా ఉంటుందని ఈ మూవీ కోసం తాను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం రావడం తనకు గర్వంగా ఉంది అని తెలిపింది.అలాగే ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ వికాస్ మహల్ కు కృతజ్ఞతలు తెలిపింది.తనను గుడ్ బాయ్ సినిమాలో ఎందుకు తీసుకున్నారో దేవుడికే తెలియాలి అని తెలిపింది రష్మిక మందన్న. ఆయన గర్వించేలా తాను నటించానని అనుకుంటున్నానని అని రాసుకొచ్చింది రష్మిక మందన.