భారత సైన్యంలో కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.కొందరు ప్రతిపక్ష నేతలు కూడా ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కేవలం కేంద్రం ఖర్చు తగ్గించుకునేందుకే కొత్త విధానాన్ని తెచ్చారని నిందలేస్తున్నారు.అయితే ఈ తరహా విధానం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంది.
అమెరికాలో సైతం రెండు, నాలుగు, ఆరేళ్ళ తాత్కాలిక రిక్రూట్ మెంట్ విధానం అమలు చేస్తున్నారు.దీనివల్ల యూత్ లో దేశభక్తి పెరుగుతుందని, నాలుగేళ్ళ తర్వాత వారికి రకరకాల అవకాశలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
అభ్యర్థుల కోరిక మేరకు వయో పరిమితి పెంచింది.అంతేగాకుండా కేంద్ర హోం శాఖ పరిధిలోని ఏడు సాయుధ బలగాల్లో అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కూడా ప్రకటించారు.
అగ్నిపథ్ లోని 25 శాతం మందిని శాశ్వత రిక్రూట్ మెంట్లోకి తీసుకుంటారు.ఇవన్నీ గమనించకుండా ప్రతిపక్షాలు ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొడుతున్నాయి.అనవసరంగా యువతను తప్పుదారి పట్టించి వారి భవిష్యత్ ను నాశనం చేస్తున్నాయి.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో ఒక యువకుడు మరణించడానికి ప్రతిపక్షాలే కారణమని చెప్పక తప్పదు.
ఇప్పటికైనా విపక్షాలు వాస్తవాలు తెలుసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకుంటే బాగుంటుంది.
కొద్ది రోజుల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారంటూ…ముస్లిం సంఘాలు అనేక నగరాలు, పట్టణాల్లో హింసకు దిగాయి.తాజాగా ఆర్మీలో అగ్నిపథ్ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ళ రిక్రూట్ మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి.అగ్నిపథ్ తరహా విధానం ప్రపంచంలోని అనేక దేశాల్లో అమలవుతోంది.
అగ్ర రాజ్యం అమెరికాలో కూడా రెండు, నాలుగు, ఆరేళ్ళ రిక్రూట్ మెంట్ విధానం ఉంది.అనేక దేశాల విధానాలను పరిశీలించి చేసిన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, ఆర్మీ ఉద్యోగార్థులు ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నారు.