సినిమా రంగంలో పైకి చెప్పకపోయినా చాలామంది సెలబ్రిటీలు సెంటిమెంట్లను ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే.స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్యమైన వ్యక్తులను కలవాలని అనుకున్నా, సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమం జరపాలన్నా ముహూర్తాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ఇండస్ట్రీలో పేరుంది.
సరైన ముహూర్తం లేకుండా పనులు చేస్తే మంచి ఫలితాలు రావని బాలయ్య భావిస్తారు.మరో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కారు నంబర్ 9999 ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు.
9999 ఫ్యాన్సీ నంబర్ కోసం తారక్ లక్షల్లో డబ్బు ఖర్చు చేసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు సైతం సినిమాల విషయంలో, ఇతర విషయాలకు సంబంధించి సెంటిమెంట్లు ఉన్నాయి.
ఈ సెలబ్రిటీలలో కొంతమంది వింత సెంటిమెంట్లు ఫాలో కావడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఒక చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి.
సర్జరీ ద్వారా ఆరో వేలిని తొలగించుకునే ఛాన్స్ ఉన్నా వేలిని తొలగించుకోవడానికి ఈ హీరో ఇష్టపడలేదు.
హృతిక్ రోషన్ కుటుంబ సభ్యులు ఆరో వేలే నీకు లక్ ను తెచ్చిపెడుతుందని చెప్పిన నేపథ్యంలో హృతిక్ రోషన్ గుడ్డిగా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతుండటం గమనార్హం.ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరైన ఏక్తా కపూర్ తను నిర్మించే సినిమాలు లేదా సీరియళ్లుఎక్కువగా కే లెటర్ తో తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటారు.కే లెటర్ అంటే నాకు నమ్మకం అని ఈ విషయంలో ఎవరేం అనుకున్నా తాను పట్టించుకోనని ఆమె చెబుతుండటం గమనార్హం.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన సినిమా రిలీజ్ అవుతుంటే విదేశాలకు వెళ్లిపోతారు.తాను భారత్ లో ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుందని విదేశాల్లో ఉంటే సినిమా హిట్టవుతుందని అక్షయ్ కుమార్ బలంగా నమ్ముతారు.రాజస్థాన్ రాయల్స్ కు ఓనర్ అయిన శిల్పాశెట్టి ఒకసారి కాలు మీద కాలు వేసుకున్న సమయంలో మ్యాచ్ గెలవడం, రెండు వాచ్ లు ధరించిన మరో సందర్భంలో మ్యాచ్ గెలవడంతో మ్యాచ్ ఎప్పుడు జరిగినా అదే విధంగా చేస్తూ ఈ సిల్లీ సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు.