టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత సైబర్ నేరగాళ్లు మోసాలకు అడ్డులేకుండా పోతోంది.సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు పాల్పడుతూ లక్షల్లో డబ్బులు దోపిడీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనికపూర్ సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ వివరాలు, పాస్వర్డ్ తదితర డేటాని సైబర్ నేరగాళ్లు చోరీ చేసి ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి నెలలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లు బోనీకపూర్ వెల్లడించారు.అయితే ఆ సమయంలో తనకు ఎలాంటి సమాచారం అందలేదని తిరిగి బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ బిల్లు తన మొబైల్ కి వచ్చినప్పుడు చెక్ చేసుకోగా తాను డబ్బు పోగొట్టుకున్న విషయాన్ని గ్రహించానని ఆయన పోలీసుల దగ్గర తెలియజేశారు.
ఈ క్రమంలోనే బోనికపూర్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు 3.82 లక్షలు దోపిడీ చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బోనికపూర్ బుధవారం మే 25 వ తేదీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అంబోలీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విచారణలో భాగంగా చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోని ఈ కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.