మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు ఇంటి బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అదే విధంగా తన అభిమానులకు ఆరోగ్యపరమైన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను చేసింది.ఆ పోస్టులో కరోనా బారిన పడ్డాను అని తెలిపింది.
ఆమె గత వారం పరీక్షించుకోగా.ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందట.
ఈ మేరకు ఉపాసన షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ పోస్ట్ లో ఉపాసన ఈ విధంగా రాసుకొచ్చింది.మొత్తానికి కోలుకున్నాను.మళ్లీ యుద్దం చేసేందుకు రెడీగా ఉన్నాను.
నా శరీరం ఏం చెబుతుందో అది వినడం నేర్చుకున్నాను.గత వారం నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి.దీంతో డాక్టర్స్ నన్ను కేవలం పారాసిట్రమాల్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే వాడమని సూచించారు.
ఈ కరోనా మహమ్మారి సోకండంతో చాలా మంది నాకు నీరసించిపోవడం, హేయిర్ లాస్ అవ్వడం, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు.

కానీ ఆ సమస్యలేవీ నా మీద ప్రభావం చూపించలేవు.ఎందుకంటే నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను.అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు అని చెప్పుకొచ్చింది ఉపాసన.
ఆ పోస్ట్ పై అభిమానులు స్పందింస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు.మళ్లీ వైరస్ విజృంభిస్తుందా అని అడగగా.
చెప్పలేను.కానీ, మనం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
చెన్నైలోని తాతయ్య అమ్మమ్మలను కలిసేందుకు వెళ్లాను.కాబట్టే కోవిడ్ పరీక్షలు చేసుకున్నాను.
అలా చేసుకున్నాను కాబట్టే కరోనా వచ్చిందని తెలిసింది.లేదంటూ తెలిసేది కాదు.
వల్ల వైరస్ బయటపడింది.లేదంటే అసలు తెలిసేదే కాదు అని చెప్పుకొచ్చింది ఉపాసన.