నేను రూ.3 కోట్ల కారు కొనలేను.. జస్ట్ కోటి రూపాయిల ఖరీదు కారు కొనగలను!

బాలీవుడ్ సీనియర్ హీరో అయిన అనిల్ కపూర్, కుమారుడు హర్షవర్ధన్ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం థార్. ఇక ఈ సినిమా మే 6వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 Hero Anil Kapoor Son Harshavardhan Kapoor Comments Viral During Thar Movie Promo-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా హర్షవర్ధన్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటన గురించి తెలిపారు.

కానీ అదికాస్త రివర్స్‌ అయిందని తెలిపాడు.ఇక హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్‌ ట్రోలింగ్‌కు దిగారు.

ఈ ట్రోలింగ్‌తో హర్షవర్ధన్ కపూర్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచాడు.

ఇంటర్వ్యూలో ‘ప్రేక్షకులకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను.

నాకు వస్తువులు కొనేందుకు నా తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టముండదు.నాకు కావాల్సిన వాటిని నా సొంత డబ్బుతో కొనుక్కుంటాను.అందుకే నేను రూ.3 కోట్ల ఖరీదుగల కారుకు బదులు కోటి రూపాయల లంబోర్గిని కారు కొనాల్సి వస్తుంది.నా దగ్గర ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు.నా దగ్గర 5 కార్లు, 30 గడియారాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు.కానీ అది నిజం కాదు.ఇదే నా జీవితంలోని విషాదకరమైన వాస్తవం అని హర్షవర్ధన్‌ చెప్పుకొచ్చాడు.

Telugu Bollywood, Harshvardhan, Anil Kapoor, Lamborghini Car, Thar-Movie

ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్‌ హర్షవర్ధన్‌ పై కామెంట్స్ చేస్తూ నాకు కూడా అనిల్‌ కపూర్‌ కుమారుడు హర్షవర్ధన్‌ కపూర్‌ల విచారంగా ఉండాలని ఉంది అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.మరొక నెటిజెన్ అతనికున్న షూ వార్డ్‌రోబ్ చూపిస్తూ ఈ షూలన్ని వేసుకుని డ్రైవ్ చేయడానికి అతనికి లంబోర్గిని కారు లేదు.అదే నిజమైన బాధ.ఇది చూసి ఆడిషన్స్‌కు 125సీసీ బైక్స్‌పై ఎవరు వెళ్తారు.అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube