అభిమాని సర్‌ప్రైజ్ గిఫ్ట్ తో హీరో రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు.అవును.
కాదేదీ ప్రతిభకు అనర్హం అన్నట్టు కళాకారులు తమ మెదడకు మేత పెడితే ఎలాంటి ఘనకార్యాలైనా సాధిస్తారు అనడానికి ఇదొక మచ్చుతునకలాంటి ఉదాహరణ.ఆమె ఓ అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న మహిళ.
ఆమె పేరు బొడ్డు శ్రీమతి.తన భర్త సుదర్శన్ అండతో ఆమె అద్భుతాలు చేస్తోంది.
వీరి కుటుంబం కరీంనగర్ లోని బోయవాడలో నివాసం ఉంటోంది.ఇక ఆమె ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే వెదురు బొంగులు, చీపురు పుల్లలతో అద్భుతమైన కళా ఖండాలకు జీవం పోస్తోంది.
కరీంనగర్ పట్టణానికి చెందిన టవర్, కమాన్ వంటివాటిని సునాయాసంగా వెదురుబొంగులు, చీపురుపుల్లలతో డిజైన్ చేసి డెకొరేటివ్ ఆర్ట్స్ గా తీర్చి దిద్దుతోంది.అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఈఫిల్ టవర్, లోటస్ టెంపుల్, హైటెక్ సిటీ, ఎర్రకోట, గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్ తోబాటు మన పార్లమెంట్ భవనాన్ని సైతం ఆ పుల్లలతో ఇట్టే తయారు చేసేస్తోంది.
ఒక్కో ఆర్ట్ చేయడానికి దాదాపుగా 3 – 6 నెలల సమయం పడుతుందని ఆమె చెబుతోంది.ఇక ఆమె ఆర్ట్స్ ని చూసిన వారు ఎలాంటి వంకలు పెట్టలేరని స్థానికులు చెప్పడం హర్షణీయం.
చిన్నప్పుడు తన మామగారు అట్టముక్కలతో చేస్తున్నటువంటి స్కూల్ బిల్డింగ్ చూసిన తన మనసులో దీనిపై ఆసక్తి పెరిగిందని చెబుతోంది.
ఇక మన హీరో రామ్ చరణ్ విషయానికొస్తే, ఆమె మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అట.

ఈ క్రమంలో రామ్ చరణ్ కొత్తగా కట్టుకున్న ఇంటిని సైతం ఇలాగే పుల్లలతో తయారు చేసి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిందట.అలాగే తాజాగా రామ్ చరణ్ గత పుట్టిన రోజు సందర్భంగా మన హీరోకి ఆ బహుమతి ఇవ్వగా రామ్ చరణ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైనట్లుగా సమాచారం.ఈ సందర్భంగాలో ఆమె కాళ్ళకు మొక్కి రామ్ చరణ్ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా ఆవిడ ఒక గిఫ్ట్ తయారు చేశారట.చిరంజీవి సొంత ఊరు మొగల్తూరులో నివాసమున్న ఇంటిని పూర్తిస్థాయిలో వెదురు పుల్లలతో తయారు చేశారట.ఇక దీన్ని ఈసారి మెగాస్టార్ బర్త్ డేకి గిఫ్ట్ గా ఇస్తానని చెబుతున్నారు.