హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఈనెల 30న ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రులు, సీజేల సమావేశం అజెండాపై చర్చ.ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో, ముఖ్యమంత్రి వైయస్‌.

 Chief Minister Meets Chief Justice Of The High Court , Chief Justice Prashant Ku-TeluguStop.com

జగన్‌ సమావేశమయ్యారు.స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది.

ఈనెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల భేటీ దృష్ట్యా సమావేశం అజెండాపై ఇరువురు చర్చించారు.ఏప్రిల్‌ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితోపాటు, పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయసహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ–కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

వీటికి సంబంధించి రాష్ట్ర నుంచి నివేదించనున్న అంశాలపై ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చర్చించారు.హైకోర్టు ఉన్నత పరిపాలనా అధికారులు, రాష్ట ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube