ధరణి వెబ్సైట్ తో రైతులు పడుతున్న అవస్థలను వెంటనే పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు డిమాండ్ చేస్తూ,ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోనీ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు,ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ.వైరా మండలం సోమవరం గ్రామంలో దశాబ్దాల కాలంగా సాగుచేసుకున్న మూడు వందల ఎకరాలు పంట పొలాలు ధరణి వెబ్సైట్లో పెండింగ్లో పెట్టారని దీనివల్ల రైతులు రుణాలు తీసుకునే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయని దీనివలన రైతుబంధు, పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.ధరణి వెబ్సైట్ వల్ల భూమి సర్వే నెంబర్లు తారుమారయ్యాయని దీని వలన రైతులు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారాని తెలిపారు.
రైతులు పండించే భూములను ప్రభుత్వం రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పెండింగ్లోవున్న పాస్ పుస్తకాలను, రైతుబంధు పాస్ పుస్తకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు