బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఆలియా భట్ ఒకరు.ఈమె ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారి పోయింది.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అందరితో నటిస్తుంది.
తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆలియా.ఆలియా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కనిపించనుంది.ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో కనిపించి మెప్పించింది.ఈ సినిమా మార్చి 25న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఈయన సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ట్రిపుల్ ఆర్ మ్యానియా నడుస్తుంది.ఈ సినిమాలో నటించిన ఇద్దరు స్టార్ హీరోల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.అయితే ఈ సినిమా గురించి ఈ సినిమాలో తాను ఒక సీన్ కోసం ఎంత కష్టపడిందో ఆలియా భట్ చెప్పుకొచ్చింది.
ఈమె ఏకంగా ఒక్క సన్నివేశం కోసం ఏడాది పాటు కష్టపడిందట.
తాజాగా ఈమె ఈ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈమె ఈ సినిమాలో తన అనుభవాలను గురించి మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది.ఈమె తొలిసారి ఒక సన్నివేశాన్ని ఒకటిన్నర సంవత్సరాల పాటు నేర్చుకున్నానని తెలిపింది.అందుకు కారణం లాక్ డౌన్ అని తెలిపింది.ఈ సన్నివేశాన్ని ఒక నెలలో షూట్ చేయాలని అనుకోగా లాక్ డౌన్ లోకి వెళ్ళాము.ఆ తర్వాత నేను ఆ సన్నివేశాన్ని ఒకటిన్నర సంవత్సరాల పాటు నేర్చుకుంటూనే ఉన్నా అంటూ తెలిపింది.