టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను అలరించలేక పోయింది.
అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలు లైన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.వీటితో పాటుగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాలో నటించ బోతున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా ఆ ప్రాజెక్టు అయ్యింది అని అంటున్నారు.
త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది.
దర్శకుడు మారుతి చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని వారిలో మాళవిక మోహన్ తో పాటుగా కృతి శెట్టి మూడవ హీరోయిన్ కోసం చిత్రబృందం అన్వేషణలో ఉంది అని సమాచారం.
అంతే కాకుండా ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
ఈ రాజా డీలక్స్ సినిమాలోని ప్రభాస్ ఇంటి సెట్ కోసం ఏకంగా 5 కోట్లతో ఒక భారీ సెట్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అందు లోనే ఎక్కువగా షూటింగ్ జరగ నుందట.అంతే కాకుండా తన కెరీర్లో ఎప్పుడూ చేయని విధంగా ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కామెడీని పంచ బోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.శ్రీను వైట్ల అనిల్ రావిపూడి చిత్రాల తరహాలోనే ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందట.
ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ తో అభిమానుల్ని నవ్వించబోతున్నాడు అని భోగట్టా.రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ చేస్తున్న నాలుగు సినిమాల్లోనూ ఆయన చేస్తున్నవి సీరియస్ పాత్రలే కావడంతో ప్రభాస్ వాటి తర్వాత ఒక కంప్లీట్ కామెడీ చిత్రం చేయాలని అనుకుంటున్నారని, అందుకే మారుతి చిత్రానికి అంగీకరించారని టాక్.