మొన్నటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ ధరలు పెంచాలి అంటూ సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు దర్శకులు నిర్మాతలు అందరూ కోరుకున్నారు.ఈ మేరకు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు కూడా అందించారు.
టిక్కెట్ల రేట్లపై థియేటర్లు కుదేలయి పోతున్నాయని రేట్లు గిట్టు బాటు కావడం లేదని, సీఎం జగన్ సినీ పరిశ్రమను చంపేస్తున్నారని దాని కారణంగా అఖండ, పుష్ప ఇలాంటి సినిమా బయ్యర్లకు డిస్కౌంట్ బేరాలు సాగించారు.అయితే సినీ ఇండస్ట్రీ వారి కోరిక మేరకు జగన్ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచు కోమని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా రోజుకు 5 షోలు ఆడించు కోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది.అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ రేటు తగ్గించాలి అంటూ బయ్యర్లు కోరుతున్నారు.
ఆంధ్రలో 100 కోట్ల మేరకు కొనుగోలు చేయడమే కాకుండా అడ్వాన్సులు కట్టి ఇప్పుడు తీరా సినిమా విడుదల తేదీ దగ్గర పడే సమయానికి టికెట్ల రేట్లు తగ్గించాలి అనే బేరాలు ఆడుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు.
ఎందుకంటే ఎప్పుడో జమానా కాలంనాడు అడ్వాన్సులు ఇచ్చారు.కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఆలస్యం అవ్వడంతో వడ్డీల భారం పడిందని ఆంధ్రప్రదేశ్లోని బయ్యర్లు చెబుతున్నారు.
ఈ మేరకు కనీసం 20 శాతం అన్న డిస్కౌంట్ ఇవ్వాలి అని బయ్యర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం కనుక రూపాయలు అదనపు ఇస్తే ఈ డిమాండ్ వుండక పోవచ్చు.అలా ఇట్లా కూడా వడ్డీలు, భారీ రేటు గిట్టు బాటు కావని, ఎగ్జిబ్యూటర్లు దగ్గర డబ్బులు లేవని, అందువల్ల కొంతైనా తగ్గిస్తే బెటరని ఆర్ఆర్ఆర్ సినిమాను కొన్న ఒక డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.మరి ఈ విషయం పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.