కర్ణాటకలోని ఓ కళాశాల యాజమాన్యం హిజాబ్ ధరించిన విద్యార్థులను లోపలకి అనుమతించలేదు.ఈ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ప్రపంచ దేశాలు సైతం ఈ వివాదంపై స్పందించాయి.కేరళ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీకి ఇబ్బందిగా మారింది.
ఇదే తరహాలో ఏపీ రాష్ట్రంలోను హిజాబ్ వ్యవహారం పెద్ద దుమారమే లేపుతోంది.విజయవాడలోని లయోలా కళాశాలలో ఈ వివాదం తలెత్తింది.
ప్రతి రోజు మాదిరిగానే కాలేజీకి వెళ్లిన విద్యార్థులను సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు.బుర్కా కారణంగా లోపలికి అనుమతించలేమని చెప్పారు.వారు కాలేజీ ఐడీ చూపించగా .దానిపై హిజాబ్ ధరించిన ఫొటో ఉండడంతో లోనికి అనుమతించలేదు.వెంటనే విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు.వారితోపాటు ముస్లిం మతపెద్దలు, విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్నాయి.ఎప్పుడూ లేనిది కొత్తగా ఏంటి అంటూ నిప్పులు చెరిగారు.కాగా కలెక్టర్, కమిషనర్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
అయితే ఈ ఘటన మీడియా, సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.దీంతో ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యి స్పందించారు.
ఏపీలో ఇలాంటి వివాదాలకు తావు లేదని, అసలు ఎలా ఈ వివాదం చోటుచేసుకుందనే అంశం తెలుసుకోవాలని సూచించారు.బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలిసింది.
ఇప్పటికే ఏపీ అనేక వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది.ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గం ఈ వివాదంపై మండిపడితే ఇబ్బందులు తప్పవు.దీనిని గమనించిన సీఎం జగన్ స్పందిచినట్టు తెలిసింది.అనవసర తలనొప్పులు పెరుగుతాయని, హిజాబ్ విషయంలో జగన్ అలర్ట్ అయినట్టు సమాచారం.
మొత్తంగా ఈ వివాదానికి కారణమైన లయోలా కాలేజీ యాజమాన్యం మాత్రం మరో వాదనను వినిపిస్తుండడం గమనార్హం.తమ కళాశాలలో చేరే సమయంలోనే నిబంధనలు పాటిస్తామని చెబుతోంది.
విద్యార్థులు సంతకాలు చేస్తారని, తమ కళాశాలలో యూనిఫామ్ మాత్రమే అనుమతిస్తామంటూ చెబుతోంది.ఈ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి సోకడం పట్ల జగన్ సీరియస్ అయినట్టు సమాచారం.