Apple కంపెనీకి దెబ్బ పడింది.. భారీ మూల్యం చెల్లించనున్న CEO!

Apple కంపెనీకి గట్టి దెబ్బ పడిందనే చెప్పుకోవాలి.నార్ఫోక్‌ కౌంటీ కౌన్సిల్‌ Apple మీద దావా వేసింది.

 Apple కంపెనీకి దెబ్బ పడింది.. భారీ-TeluguStop.com

వివరాల్లోకి వెళితే… Apple జనవరి 2019లో లాభాల హెచ్చరికను జారీ చేయడానికి ముందు ఐఫోన్ల విక్రయానికి సంబంధించి ఫేక్ వార్తలను సృష్టించిందని ఈ సందర్భంగా నార్ఫోక్‌ కౌంటీ కౌన్సిల్‌ ఆరోపించింది.ఈ కౌన్సిల్‌ 3.8 బిలియన్‌ యూరోల పెన్షన్‌ ఫండ్‌ను నడిపిస్తోంది.ఇది యాపిల్‌లో వన్ అఫ్ ది షేర్‌ హోల్డర్‌ కంపెనీగా ఉండటం గమనార్హం.

అందు వల్లనే నేడు Apple మూల్యం చెల్లించుకోనుంది…

అసలు కారణం?

2018వ సంవత్సరంలో చైనాలో ఐఫోన్లకున్న డిమాండ్‌ని క్యాష్ చేసుకొనే క్రమంలో వాటాదారులను Apple తప్పుదారి పట్టించింది… అనే ఆరోపణలపై నార్ఫోక్‌ కౌంటీ కౌన్సిల్‌, Apple చీఫ్‌ ఎర్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ లూకా మ్యాస్తిపై తాజాగా దావా వేసింది.కొన్ని నివేదికల ప్రకారం చూసుకుంటే, Apple iPhone అమ్మకాల ఒత్తిడి చూసే అవకాశం ఉందని కుక్‌ 2018లో వాటాదారులతో ఓ బోగస్ వార్త చెప్పారట.

దానికి కారణంగానే నార్ఫోక్‌ కౌంటీ కౌన్సిల్‌ Appleని బయటకు లాగింది.

షేర్‌ హోల్డర్లకు న్యాయం జరిగేదెప్పుడు?

ఇక అలాగే జనవరి 2019లో Apple తన లాభాలను సుమారుగా 6 బిలియన్ల యూరోల మేర కోల్పోనుందని కుక్‌ పెట్టుబడి దారులకు చెప్పడం జరిగింది.ఈ నేపథ్యంలో నవంబర్‌ 2018లో ఐఫోన్‌ అమ్మకాలు సరిగ్గా జరపలేదనే విషయం కుక్‌ కు ముందే తెలుసునని నార్బోక్‌ కౌంటీ కాన్సిల్‌ వాదించింది.దీని వల్ల కౌన్సిల్‌ పెన్సన్‌ ఫండ్‌ దాదాపు 1 బిలియన్‌ డాలర్లను నష్టపోయినట్లు పేర్కొంది.

ఒక వేళ యాపిల్‌పై వేసిన ఆరోపణలు నిజమని తెలిస్తే కంపెనీ భారీ మూల్యాన్ని చెల్లించనుంది.

Norfolk County Council Sues Apple Over Iphone Sales Predictions Details, Apple, Fine, Huge Fine, Latest Viral,norfolk County Council ,sues Apple ,iphone Sales Predictions, Apple Ceo Tim Cook, California, Six Billion Euros - Telugu Apple, Calinia, Fine, Iphone, Latest, Norfolkcounty, Euros, Sues Apple

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube