నాని, వివేక్ ఆత్రేయ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ `అంటే సుంద‌రానికీ...షూటింగ్ పూర్తి.

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే సుందరానికీ.వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

 Nani, Vivek Atreya, Maitri Movie Makers` Means Sundaraniki Shooting Is Over. Na-TeluguStop.com

రోమ్-కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఈ సంద‌ర్భంగా “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది.#అంటే సుందరానికి“ అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా విడుద‌లైన `అంటే సుందరానికీ.` ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు.ఫ‌స్ట్ లుక్‌తోనే ఇదొక డిఫ‌రెంట్ మూవీ అని తెలియ‌జేశారు నాని.ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో `కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్` అనేది నాని పాత్ర పేరు.

అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది.ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.

తారాగ‌ణంః

నాని, న‌జ్రియా ఫ‌హ‌ద్‌, న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌

సాంకేతిక వ‌ర్గంః

ర‌చ‌న‌, ద‌ర్శ‌కత్వం: వివేక్ ఆత్రేయ‌, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ వై,బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌,సీఈఓ: చెర్రీసంగీతం: వివేక్ సాగ‌ర్‌,సినిమాటోగ్ర‌ఫి: నికేత్ బొమ్మి,ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌,ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌త నాయుడు,కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ప‌ల్ల‌వి సింగ్‌ ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను,పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్‌

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube