కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైరస్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ ఛిన్నాభిన్నమైంది.
లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా.అపర కుబేరుల సంపద సైతం గంటల్లో ఆవిరైంది.
వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించేలోపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో కొరడా ఝళిపిస్తోంది.రానున్న రోజుల్లో ఇది మరింత బలపడినా.
ప్రజలను రక్షించుకోవాలంటే వున్న ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సినేషన్.ఆరోగ్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.కొందరు ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేసుకుంటుంటే.
కొన్నిచోట్ల మాత్రం ససేమిరా అంటుండటంతో ప్రభుత్వం సైతం కఠినంగానే వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ టీకాలు తీసుకోని వ్యక్తులకు జరిమానా విధిస్తామని ఆ ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి బుధవారం హెచ్చరించారు.ఈ ప్రకటన వెలువడిన గంటల్లోనే ఫస్ట్ డోస్ తీసుకునేందుకు అపాయింట్ మెంట్లు పెరిగాయి.
దీనిపై క్యూబెక్ ఆరోగ్య మంత్రి క్రిస్టియన్ డ్యూబ్ స్పందించారు.తమ నిర్ణయం ప్రోత్సాహకరంగా వుందని.
తద్వారా తొలి టీకా తీసుకునేందుకు అపాయింట్ మెంట్లు పెరిగాయని ఆయన అన్నారు.
మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ డోస్ కోసం జనవరి 11న దాదాపు 7000 మంది అపాయింట్ మెంట్‌లు తీసుకున్నారని.
గడిచిన రోజుతో పోలిస్తే 2000 అపాయింట్‌మెంట్లు పెరిగాయని హెల్త్ మినిస్టర్ చెప్పారు.మంగళవారం 1,07,000 మంది కోవిడ్ వ్యాక్సిన్ డోసులు తీసుకున్నప్పటికీ.
మొదటి డోస్ కోసం అన్ని వయసుల వారు అపాయింట్ మెంట్ తీసుకున్నారని డ్యూబ్ చెప్పారు.అంతకు ముందు క్యూబెక్ ప్రీమియర్ ఫ్రాంకోయిస్ లెగాల్ట్ మాట్లాడుతూ.
టీకాలు వేయని వ్యక్తులకు రాబోయే వారాల్లో ఆరోగ్య పన్నును విధిస్తామని ప్రకటించారు.

ఫ్రెంచ్ భాష ఎక్కువగా మాట్లాడే.ఈ ప్రావిన్స్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు.టీకాలు తీసుకోని వారి వల్ల ప్రజారోగ్య వ్యవస్థపై భారంగా మారిందని వారు చెబుతున్నారు.
క్యూబెక్‌లో అర్హత వున్న 90 శాతం మందికి తొలి డోసును అందించగా.మిగిలిన 10 శాతం మంది ఇతరులకు హాని కలిగించరాదని లెగాల్ట్ సూచించారు.
టీకాలు తీసుకోని వారిపై విధించే జరిమానాకు సంబంధించిన వివరాలను క్యూబెక్ ప్రావిన్స్ ఇంకా ఖరారు చేయలేదు.అయితే లెగాల్ట్ చెప్పినదాని ప్రకారం ఈ పన్ను గణనీయంగానే వుంటుందని తెలుస్తోంది.
మరోవైపు ఈ పన్నుపై కెనడాలోని హక్కుల సంఘాలు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.