అంజీర్ పండ్లు.వీటినే అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు.
విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు అంజీర్ పండ్లలో నిండి ఉండటం వల్ల.ఇవి ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అందుకే అంజీర్ పండ్ల గురించి తెలిసిన వారు ఖచ్చితంగా తమ డైట్‌లో వాటిని చేర్చుకుంటారు.అలాగే కొందరు ఈ పండ్లను ఎంతో ఇష్టపడతారు కూడా.
అయితే అంజీర్ పండ్లు తింటున్న వారు, తినాలని అనుకుంటున్న వారు తప్పని సరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి.లేకుంటే చాలా నష్టపోతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కొన్ని విషయాలు ఏంటో ఓ చూపు చూసేయండి.అంజీర్ పండ్లలో ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.
వాటిని మితంగానే తీసుకోవాలి.
అతిగా తీసుకుంటే మాత్రం వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా అంజీర్ పండ్లను పరిమితికి మించి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో పట్టేసినట్టు అయిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.అలాగే ఆడవారు నెలసరి సమయంలో అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల కడుపునొప్పి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
మరియు అధిక రక్త స్రావానికి కూడా దారి తీస్తుంది.
అంజీర్ పండ్లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల, ఈ పండ్లను ఓవర్‌గా తినేస్తే ఆక్సలేట్ శరీరంలోకి కాల్షియంను గ్రహించేస్తుంది.దాంతో కాల్షియం లోపం ఏర్పడి.ఎముకలు, దంతాలు బలహీన పడిపోతాయి.ఇక అంజీర్ పండ్లను అతిగా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బ తింటుంది.మరియు ఏమైనా కాలేయ సమస్యలు ఉంటే అవి ఇంకా తీవ్ర తరంగా మారతాయి.సో.అంజీర్ పండ్లను చాలా లిమిట్‌గానే తీసుకోండి.