ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు ఎక్కువగా పని చేస్తున్న కొరియోగ్రాఫర్లలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉన్నారు.బాలకృష్ణ అఖండ సినిమాలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కొన్ని ఫైట్లు చేయగా ఆ ఫైట్లకు మంచి పేరు వచ్చింది.
పుష్ప ది రైజ్ సినిమాకు కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పని చేశారు.కెమెరా మేన్స్, టెక్నీషియన్స్ విషయంలో చెన్నై వాళ్లు ఇక్కడ ప్రభావం చూపిస్తున్నారని రామ్ లక్ష్మణ్ అన్నారు.
పెద్దపెద్ద స్పాన్ ఉన్న సినిమాలకు చేస్తుండటంతో ఎక్కువ సినిమాలకు పని చేయలేకపోతున్నామని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అన్నారు.దర్శకులు తమనుంచి ఏం ఆశిస్తున్నారో ఆ విధంగా తాము ఫైట్లు కంపోజ్ చేస్తున్నామని మాస్టర్స్ వెల్లడించారు.
అరవింద సమేత సినిమాలో క్లైమాక్స్ లో ఫైట్ ఉండాలని కథ కోసం ఆ సినిమాలో ఫైట్ వద్దని చెప్పామని రామ్ లక్ష్మణ్ అన్నారు.అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా నుంచి మమ్మల్ని తీసేశారని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
ఆ సినిమాలో హీరో మిలటరీ ఆఫీసర్ కాగా పోలీస్ ను కొట్టాలని రెండు రోజులు కంపోజ్ చేసినా మాకే నచ్చలేదని మూడోరోజు ఆ సినిమా నుంచి తీసేశారని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అన్నారు.
ఆ ఫైట్ కు ముందే అల్లు అర్జున్ మీరు సూపర్ అంటూ పొగిడారని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పేర్కొన్నారు.కథలో సరైన పొజిషన్ లేకపోతే ఫైట్స్ కంపోజ్ చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వెల్లడించారు.
ఆంధ్రుడు సినిమాకు పబ్ లో ఫైట్ ఉందని ఎమోషనల్ సీన్ ఉన్నా దర్శకుడి కోరిక మేరకు మార్పులు చేయాల్సి వచ్చిందని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చెప్పారు.ఆంధ్రుడు క్లైమాక్స్ సీన్ విషయంలో ప్రొడ్యూసర్ సపోర్ట్ తీసుకుని దర్శకుడిని కన్విన్స్ చేశామని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వెల్లడించారు.సినిమాలలో గొడవలు ఫ్యామిలీ గొడవలలాంటివని మాస్టర్స్ పేర్కొన్నారు.