టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తరువాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ లో ధీమా మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది.అందుకే బీజేపీలోనూ సొంత వర్గాన్ని తయారు చేసుకుంటూ , తాను కీలకమైన వ్యక్తిగా నిరూపించుకునే ప్రయత్నం రాజేందర్ చేస్తున్నారు.
రాష్ట్ర బీజేపీ నిర్ణయం కు వ్యతిరేకంగా రాజేందర్ నిర్ణయాలు తీసుకుంటూ, తాను ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగిన వ్యక్తిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ అధిష్టానం రాజేంద్ర కు ప్రాధాన్యం పెంచుతూ, ఆయన ద్వారా పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరికలు ఉండేలా చేసుకుంటోంది.
ఈటెల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాయి ఉండటం , ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ ఉండడం, టీఆర్ఎస్ ప్రభుత్వం లోనూ కేసీఆర్ తర్వాత నంబర్ టు స్థానంలో ఆయన కొనసాగడం, ఇప్పటికీ టీఆర్ఎస్ లో ఎక్కువమంది ఈటల రాజేందర్ ను అభిమానిస్తూ ఉండడం, ఇలా ఎన్నో కారణాలతో బీజేపీ అధిష్టానం కూడా రాజేందర్ కు ప్రాధాన్యం పెంచుతూనే వస్తోంది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాజేందర్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.
నిన్ననే మీడియా సమావేశం నిర్వహించిన రాజేందర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కూడా సిద్ధం అంటూ ఆయన ప్రకటించారు.
ఈ పథకం ద్వారా రాజేందర్ తాను ఏ స్థాయి వ్యక్తినో చెప్పకనే చెప్పారు.రాజేందర్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రిని తానే అవుతాను అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
తెలంగాణలోని బీసీ సామాజిక వర్గంతో పాటు , ఇతర వర్గాలలోను రాజేందర్ పై సానుభూతి ఉండడం, పార్టీ ఏదైనా రాజేందర్ ను చూసి ఓట్లు వేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఇవన్నీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బాగా కలిసి వచ్చాయి.
ఇప్పుడు అదే ఫార్ములాతో సక్సెస్ అవ్వాలని , తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని రాజేందర్ ఇప్పుడు నేరుగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేసుకున్నట్టు గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.