ఛీ.. బొద్దింకలతో బీరు తయారీ.. దాని గురించి తెలిస్తే..!

ప్రతిరోజూ తినే ఆహారం బోర్ కొడుతుంది కాబట్టి కొత్తవి ట్రై చేయాలనే ఆలోచన మనందరిలోనూ కలగకమానదు.ఇలాంటి ఆలోచన వల్లే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్‌సి చికెన్లు, సుషీ వంటి వంటకాలు అందుబాటులోకి వచ్చాయి.

 Beer Made From Cockroaches Viral, Japan, Cockroach Beer, Cockroaches,indian Toe--TeluguStop.com

అయితే కేవలం ఘన పదార్థాలు మాత్రమే కాదు ఎన్నో సరికొత్త డ్రింక్స్ కూడా రకరకాల రుచులతో మనుషులకు కిక్కెక్కిస్తున్నాయి.మత్తెక్కించే విస్కీ, వోడ్కా, వైన్, బీరు తదితర లిక్కర్లు కూడా మనుషుల నాలికలు చవులూరేలా చేస్తున్నాయి.

అయితే ఇవి కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ఆల్కహాల్ తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాయి ఆహార కంపెనీలు.

ఈ క్రమంలో జపాన్‌కు చెందిన ఒక సంస్థ ఏకంగా బొద్దింకలతో బీరు తయారు చేసింది.

పొరపాటున ఆహారంలో పడిన బొద్దింకలను చూస్తేనే మనకి కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంది.అలాంటిది ఏకంగా బొద్దింకలతోనే బీరు తయారు చేస్తే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి.

జపాన్ లో దొరికే ఈ బీరు బొద్దింకలు కీటకాలు లాగా ఉంటాయట.వీటిని కొంచు సౌర్ అని పిలుస్తారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

వీటితో తయారుచేసిన బీరు కూల్ డ్రింక్ లాగానే ఉంటుంది.అందుకే దీనిని గటగటా తాగేస్తున్నారు జపనీయులు.

ఈ విషయం తెలుసుకొని యావత్ ప్రపంచంలోని నెటిజన్లు యాక్.ఛీ అంటున్నారు.

నిజానికి జపాన్, చైనా వంటి దేశాల్లో పురుగులు, కీటకాలతో వంటకాలు చేస్తుంటారు.కానీ తొలిసారిగా బొద్దింకలతో బీరు తయారు చేయడం మాత్రం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.

Telugu Beer, China, Cockroach, Cockroach Beer, Cockroaches, Japan-Latest News -

బీర్ తయారీ పురుగులను ఇండియన్ టాయ్ బైటర్ (Indian toe-biter) అని కూడా పిలుస్తారు.నీటిలో ఎక్కువగా నివసించే ఈ పురుగులు మనిషి కాళ్లతో సహా చేప పిల్లలు, ఇతర కీటకాలను చంపేసి తింటాయి.ఇవి భారతదేశంలో కనిపించే బొద్దింకల కంటే రెండు రెట్లు అధిక పరిణామాల్లో ఉంటాయి.వీటిని పట్టుకునేందుకు జపాన్‌, తూర్పు, దక్షిణాసియా దేశాల ప్రజలు స్పెషల్ లైట్లను ఉపయోగిస్తుంటారు.

నీళ్లలో ఈ లైట్ ఆన్ చేయగానే ఆ ప్రదేశానికి వందలకొద్దీ పురుగులు వస్తాయి.అప్పుడు వాటిని పట్టేసుకుంటారు ప్రజలు.తైవాన్‌లో దొరికే మగ బొద్దింకలు తియ్యగా చాలా రుచికరంగా ఉంటాయి.అందుకే వీటిని ఉడకబెట్టి లేదా సూప్ చేసి తింటారట.

జపాన్ బీర్ తయారీలో మగ పురుగులు బాగా వాడతారు.ఈ పురుగుల నుంచి ఒక రకమైన సువాసన వస్తుందట.

ఈ సువాసనను బీర్ లో కలిపి విక్రయిస్తోంది జపాన్ బీరు తయారీ సంస్థ. ఒక్కో బీరు బాటిల్ 638 యెన్లు (రూ.426) గా అమ్ముతున్నారు.రుచి పరంగా ఇది యాపిల్ లేదా పియర్స్ పండ్ల జ్యూస్ తాగినట్లు తియ్యగా, పుల్లగా ఉంటుందట.

కానీ మందు బాబులు మాత్రం వీటిని ట్రై చేసేందుకు అసలు ఇష్టపడమని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube