కేసీఆర్ ఔట్ రైట్ గా బీజేపీ మీద ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయారు.
బీజేపీ మీద తాడో పేడో తేల్చుకుంటామని చెప్పేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే ధర్నాలు చేస్తామంటూ డేట్లు కూడా చెప్పేశారు.
ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామంటూ కూడా చెప్పేశారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేంజ్‌లో ఫైర్ కావడం ఇదే మొదటిసారి.
పైగా ధర్నాలు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్.
దీంతో కేసీఆర్ ఎలాగైనా రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయొద్దనే నిర్ణయాన్ని గట్టిగానే తీసుకున్నట్టు తెలుస్తోంది.
పైగా రాబోయే కాలంలో కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా తనకు నష్టమే అని కేసీఆర్ ముందే గ్రహించారు.ఇందులో భాగంగానే తెలంగాణ ప్రజల్లో రోజురోజుకూ బలపడుతున్న బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు రెడీ అయిపోయారు.
కారణాలు ఏమైనా కూడా కేంద్రంపై కేసీఆర్ ఫుల్ రివర్స్‌లో ఉన్నారనే చెప్పాలి.కాగా ఇలా మోడీ సర్కార్ ను విమర్శిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఇప్పుడు కేసీఆర్ కూడా చేరిపోయారు.
మొన్నటికి మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఇలాగే ఫైర్ అయ్యారు.
ఆయన మోడీ సర్కార్ మీద ప్రతి అంశంలోనూ బాగానే ప్రశ్నిస్తున్నారు.కేవలం తమిళనాడు విషయంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా బీజేపీ కేంద్రం చేపడుతున్న విధానాలపై కడిగిపారేస్తున్నారు.ఇప్పుడు కేసీఆర్ ఇదే రూట్లో పయనిస్తున్నారు.
ఇన్ని రోజులు కేంద్రం దేశ వ్యాప్తంగా తీసుకునే విధానాలపై పెద్దగా స్పందించలేదు.కానీ ఇప్పుడు రూటు మార్చారు.
పెట్రోల్, డీజిల్, నల్ల చట్టాలు ఇలాంటి వాటిమీద గళం వినిపిస్తున్నారు.ఇక రాబోయే రోజుల్లో కూడా అన్ని విషయాలమీద స్పందిస్తానని చెబుతన్నారంటే బీజేపీ బలపడకుండా చూడాలనే తపన ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
.