బాల‌కృష్ణ కామెంట్లతో షాక్ అవుతున్న త‌మ్ముళ్లు..

టీడీపీ పార్టీ అంటే ఒక చ‌రిత్ర‌.ద‌శాబ్ధాలుగా ప్రాంతీయ వాదాన్ని బ‌లంగా వినిపించిన పార్టీ.

 Tdp Cader Shocked By Balakrishna's Comments ,latest News-TeluguStop.com

జాతీయ పార్టీల హ‌వా కొన‌సాగుతున్న కాలంలో పెద్ద ఎన్టీఆర్ టీడీపీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.అప్ప‌టి నుంచే నంద‌మూరి కుటుంబం అంటే రాజ‌కీయాల్లో పెద్ద దిక్కుగా మారిపోయింది.

కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ త‌ర్వాత ఆయ‌న కొడుకులు ఎవరూ ఆయ‌న స్థాయిలో రాణించ‌లేక‌పోయారు.పైగా పార్టీ ప‌గ్గాల‌ను కూడా తీసుకోలేదు.

దీంతో చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో పార్టీని త‌న గుప్పిట్లోకి తీసుకున్నారు.

ఇక ఎన్టీఆర్ త‌ర్వాత సినిమాల్లో నంద‌మూరి వార‌సుడిగా బాగానే రాణిస్తున్న బాల‌కృష్ణ రాజ‌కీయాల్లో మాత్రం ఆ రేంజ్ లో రాణించ‌లేక‌పోతున్నారు.

సినిమాల్లో నిరూపించుకున్న బాల‌కృష్ణ రాజకీయాల్లో మాత్రం పెద్ద‌గా రాణించ‌లేక‌పోతున్నారు.ఇక దీన్నే మొన్న మోహ‌న్ బాబు అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.ఈ షోకు హోస్ట్ గా చేస్తున్న బాల‌కృష్ణ‌ను మోహ‌న్ బాబు నేరుగా ఓ ప్ర‌శ్న వేశారు.ఎన్టీయార్ త‌ర్వాత టీడీపీ ప‌గ్గాల‌ను ఎందుకు తీసుకోలేద‌ని అడగ్గా దీనికి బాల‌కృష్ణ చెప్పిన ఆన్స‌ర్ అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.

కుటుంబ వార‌స‌త్వానికి ఎన్టీఆర్ వ్య‌తిరేకం అని చెప్పుకొచ్చారు.అందుకే పార్టీ ప‌గ్గాలు తీసుకోలేద‌న్నారు.

Telugu Balakrishna, Mohan Babu, Senior Ntr, Unstoppble Nbk-Telugu Political News

పైగా టీడీపీ పార్టీ సిద్ధాంతమే అది అని చెప్ప‌డం ఇంకా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.ఎందుకంటే టీడీపీలో ఉన్న‌తందా కుటుంబ వార‌స‌త్వ‌మే.ఎవ‌రి దాకో ఎందుకు చంద్రబాబు నాయుడు ఎవ‌రు స్వ‌యానా ఎన్టీఆర్ అల్లుడే క‌దా.ఇక పార్టీలో ఉన్న సీనియ‌ర్లు అంద‌రూ త‌మ వార‌సుల‌ను టీడీపీ టికెట్ల మీద పోటీ చేయిస్తున్నారు క‌దా.

పైగా ఇప్పుడు లోకేశ్ కూడా చంద్ర‌బాబు వార‌సుడిగా పార్టీకి భావి అధ్య‌క్షుడిగానే ప్ర‌మోట్ చేస్తున్నారు క‌దా.మ‌రి ఇంత‌లా వారసత్వ రాజకీయాలు న‌డుస్తున్న టీడీపీ పార్టీని కుటుంబ వార‌స‌త్వానికి వ్య‌తిరేకం అని బాల‌య్య చెప్పడం అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube