దీపావళి పండుగ పది రోజుల్లో వస్తుందనగా చాలా మంది పిల్లలు, యువకులు రకరకాల బాణసంచాతో హోరెత్తిస్తుంటారు.అయితే బాంబుల శబ్దాలతో వాయు కాలుష్యం పెరుగుతుంది.
రసాయన వాసనలతో గాలి కాలుష్యం తీవ్రతరమవుతుంది.దీనివల్ల పచ్చని పొలాలతో మెరుపులీనే గ్రామాలు సైతం అల్లాడిపోతుంటాయి.
బాణాసంచా వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ.బాణాసంచా వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడిప్పుడే అందరూ అర్థం చేసుకుంటున్నారు.
పర్యావరణ హితమైన బాంబులు కాల్చాలని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఒక స్వచ్ఛంద సంస్థ ఓ ముందడుగు వేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.పిల్లలు, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని దేశీవాళీ బాణసంచాను రూపొందించిందీ స్వచ్ఛంద సంస్థ.వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో ఈ సంస్థ బాణసంచా తయారీలో ఒక అద్భుతం చేసిందనే చెప్పాలి.
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాకు చెందిన ప్రముఖ్ పరివార్ స్వచ్ఛంద సంస్థ 400 ఏళ్ల నాటి పద్ధతుల్లో టపాసులను తయారుచేసింది.పర్యావరణ, సమాజహితమైన ఈ టపాసులు వాడకం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదని స్వచ్ఛంద సంస్థ అధికారి నితల్ గాంధీ వెల్లడించారు.
ఈ టపాకాయలను బంకమన్ను, కాగితం వెదర్ పదార్థాలతో తయారు చేశామని.దీని వల్ల స్థానిక ప్రజలకు కూడా ఉపాధి లభిస్తోందని నితల్ తెలియజేశారు.అక్కడి స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛంద సంస్థ పుణ్యమాని తమకు ఉపాధి దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ దేశవాళీ టపాసులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగిపోతోంది.
అక్కడి స్థానికులు ఈ పాతకాలంనాటి దేశీవాళీ క్రాకర్స్ కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.దాంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇవి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.అందులోనూ ఎలాంటి ప్రమాదాలకు దారితీయని ఈ క్రాకర్స్ కొనుగోలు చేయడం ఉత్తమమని చాలా మంది భావిస్తున్నారు.