అమెరికాలో నల్లజాతీయుడు చరిత్ర సృష్టించాడు.దేశంలోనే అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరానికి తదుపరి మేయర్‌గా మాజీ పోలీస్ అధికారి, డెమొక్రాటిక్ నేత ఎరిక్ ఆడమ్స్ ఎన్నికయ్యారు.
తద్వారా న్యూయార్క్ నగరానికి సారథ్యం వహించనున్న రెండో ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆడమ్స్ రికార్డుల్లోకెక్కారు.ప్రజా భద్రత, శ్రామిక తరగతి నివాసితులకు గొంతుగా మారతానని ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్థానం చేశారు.
2014 నుంచి ఆడమ్స్ బ్రూక్లిన్ బరో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.మేయర్ ఎన్నికలలో గార్డియన్ ఏంజెల్స్ సివిలియన్ పెట్రోలింగ్ వ్యవస్థాపకుడు, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఆయన ఓడించాడు.61 ఏళ్ల ఆడమ్స్ జనవరిలో డెమొక్రాట్ బిల్ డి బ్లాసియో నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.బ్లాసియో దాదాపు ఎనిమిదేళ్ల పాటు న్యూయార్క్ మేయర్‌గా విధులు నిర్వర్తించారు.
అయితే మేయర్‌గా ఆడమ్స్‌కు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి.కరోనా వైరస్ తర్వాత నగరంలోని ఆర్ధిక వ్యవస్థ, కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టాల్సి వుంది.
న్యూయార్క్‌లో ఎరిక్ ఆడమ్స్ అత్యంత సులభంగా గెలుస్తాడని అంతా ముందే ఊహించారు.అయితే రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఆడమ్స్ అధిక ప్రాధాన్యత ఇస్తారని ప్రగతీశీల వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1960లో జన్మించిన ఆడమ్స్ .క్వీన్స్‌లోని శ్రామిక తరగతి పరిసరాల్లో నివసిస్తున్న పెద్ద కుటుంబంలో పెరిగాడు.అతని తల్లి క్లీనర్, తండ్రి కసాయిగా పనిచేసేవారు.యుక్త వయసు వచ్చిన తర్వాత ఆడమ్స్ ఒక ముఠా కోసం పనిచేసేవాడు.ఆయనకు 15 ఏళ్ల వయసు వున్నప్పుడు న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అతనిని నిబంధనల ఉల్లంఘనపై అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టారు.ఈ ఘటన ఆడమ్స్‌కు న్యూయార్క్ పోలీస్ విభాగంలోనే చేరాలనే కసిని తెచ్చింది.1980లలో అనుకున్నట్లుగానే ఆ శాఖలో ప్రవేశించి.దాదాపు 22 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.

1995లో ఆయన “100 బ్లాక్స్ ఇన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ హూ కేర్”ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇది పోలీసులలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడటానికి రూపొందించిన ఓ న్యాయవాద సమూహం.నేటికీ ఇది కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం.2006లో ఆడమ్స్ న్యూయార్క్ పోలీస్ శాఖ నుంచి పదవీ విరమణ పొందారు.అనంతరం రాజకీయాలలోకి ప్రవేశించి న్యూయార్క్ సెనేట్‌కు ఎన్నికై 2013 వరకు పనిచేశాడు.అనంతరం ఆడమ్స్ .బ్రూక్లిన్ బరో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.కాగా.ఎరిక్ ఆడమ్స్ కంటే ముందు డేవిడ్ డింకిన్స్ న్యూయార్క్ నగరానికి మేయర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి వ్యక్తి.1990 నుంచి 1993 వరకు న్యూయార్క్ నగరానికి డేవిడ్ మేయర్‌గా విధులు నిర్వర్తించారు.