తెలంగాణలో బీజేపీ పార్టీ రోజురోజుకు బలపడుతోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో బీజేపీ అంతగా బలం లేని పరిస్థితి ఉంది.
కాని దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం తరువాత బీజేపీ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమ్రోగిన పరిస్థితి ఉంది.ఇక అప్పటి నుండి తెలంగాణ వ్యాప్తంగా బలపడాలన్న దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.
ఇక అప్పటి నుండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం చేపడుతూ క్షేత్ర స్థాయిలో బలపడుతోంది.అంతేకాక ప్రస్తుతం హుజూరాబాద్ లో కూడా బీజేపీ కూడా సంతృప్తికర ఫలితం వస్తున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం హుజూరాబాద్ లో విజయం సాధిస్తే ఇక రాష్ట్రమంతా బీజేపీ పేరు మారుమ్రోగే అవకాశం ఉంది.
అయితే ఇక ఈ హుజురాబాద్ విజయం బీజేపీ కార్యకర్తలలో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.
ప్రస్తుతం బీజేపీలో సందడి వాతావరణం నెలకొంది.అయితే ఇక రానున్న రోజుల్లో కార్యకర్తల స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేసే అవకాశం ఉంది.
ఇక మొన్నటి వరకు బీజేపీని తక్కువ అంచనా వేసిన కెసీఆర్ ఇక పూర్తి స్థాయిలోబీజేపీని నిలువరించడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఇంకా టీఆర్ఎస్ కు మరింత బలంగా మారడానికి చాలా వరకు ఎక్కువ అవకాశాలు ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఎందుకు టీఆర్ఎస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయంపై టీఆర్ఎస్ పునరాలోచన చేసుకుంటేనే ఇక రానున్న రోజుల్లో టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.మరి ఇప్పటికైనా కెసీఆర్ క్షేత్ర స్థాయిలో ప్రజాగ్రహాన్ని గుర్తిస్తారా లేక ఇంకా ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.