అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్న “ది గ్రేట్ రిజిగ్నేషన్”

“ది గ్రేట్ రిజిగ్నేషన్” ప్రపంచ వ్యాప్తంగా ఈ పదం తెలియని ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు.అమెరికా కంపెనీల వెన్నులో వణుకుపుట్టిస్తున్న ఈ ఉద్యమం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది.

 The Great Resignation Millions Of People Are Quitting Jobs, The Great Resignatio-TeluguStop.com

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2019 లో పురుడు పోసుకున్న ఈ తిరుగుబాటు ఉద్యమం ఎంతో మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపించింది.అసలు “ది గ్రేట్ రిజిగ్నేషన్” అంటే ఏమిటి, ఎందుకు ఇంతగా ఈ ఉద్యమం ప్రభావం చూపించింది, ప్రఖ్యాత కంపెనీల యాజమాన్యాలు ఈ పేరు వింటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు అనే సందేహాలకు ఎన్నో సమాధానాలు ఉన్నాయి.

లక్షలాది మంది ఉద్యోగులు మూకుమ్మడిగా ఉద్యోగాలకు రాజీనామా చేయడమే “ది గ్రేట్ రిజిగ్నేషన్”.అమెరికాలో కరోనా వచ్చిన తరువాత ఏర్పడిన ఆర్ధిక నష్టాల కారణంగా ప్రఖ్యాత కంపెనీలు అన్నీ ఉద్యోగులను పెద్ద ఎత్తులో ఇంటికి సాగానంపాయి.

ఏళ్ళ తరబడి నమ్మకంగా పనిచేస్తూ సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి లాభాలు తెచ్చిపెట్టిన ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా, జాలి లేకుండా విధుల నుంచీ తప్పించడం ఎంతో మంది ఉద్యోగుల మనసులను గాయపరిచింది.దాంతో ఉద్యోగులలో మార్పు వచ్చింది.

ఈ కారణంగానే మూకుమ్మడిగా ఉద్యోగులు అందరూ కంపెనీలకు రాజీనామా చేసేశారు.వేరే ఉద్యోగం చేసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం పనిచేసేది లేదంటూ తేల్చి చెప్పారు.

ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన కంపెనీలు.

Telugu Crore Job, America, Americans Jobs, Corona Effect, Jobs-Telugu NRI

ఉద్యోగులకు అధిక వేతనాలు, నూతన ప్యాకేజీలు ఇస్తామని చెప్పినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.దాంతో అమెరికాలో అగ్ర శ్రేణి కంపెనీల వెన్నులో వణుకు మొదలయ్యింది.2019 లో కరోనా సంక్షోభంలో ది గ్రేట్ రిజిగ్నేషన్ అనే పదాన్ని అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ఆంటోని క్లాట్జ్ తెరమీదకు తీసుకువచ్చారు.కరోనా ప్రభావంతో భవిష్యత్తులో కోట్లాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారని అప్పుడే ఆయన అంచనా వేశారు.ప్రస్తుతం క్లాట్జ్ చెప్పిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి.

అమెరికాలో ఆగస్టు నెలలో సుమారు 43 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారని, 50 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం వేట మొదలు పెట్టారని ఓ సర్వే ప్రకటించింది.ముఖ్యంగా రెస్టారెంట్, హెల్త్ కేర్, సోషల్ అసిస్టెన్స్ రిటైల్ వంటి పలు రంగాలలో ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, అమెరికాలో ఆగస్టు నాటికి 1.4 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సర్వే వెల్లడించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube