తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల సందడి కొనసాగుతోంది.ఒకవైపు పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలను కూడా విడుదల చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పెద్ద హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు విభిన్న రీతులలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తాజాగా శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్,తాన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఇదే మా కథ”.
ఈ సినిమా శనివారం థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది.
అయితే ఈ సినిమా విడుదలకు ముందు చిత్రబృందం భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
అయితే ఈ సినిమా పై మరింత పబ్లిసిటీ పెంచడం కోసం చిత్రబృందం సరికొత్త కాన్సెప్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఈ సినిమా చూసి ఈ సినిమా టికెట్ ను ఇదే మా కథ అనే హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని, ఇలా పోస్ట్ చేసిన వారిలో లక్కీ డ్రా తీసి వారికి ఎన్ ఫీల్డ్ బైక్స్ ఇవ్వబోతున్నట్లు చిత్రబృందం సరికొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఇలా ఇప్పటికే చాలామంది విభిన్న రకాల కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి సినిమాకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఇదే మా కథ సినిమాకు ఎన్ఫీల్డ్ బైక్స్ ఇస్తామంటూ సరికొత్త కాన్సెప్ట్ తో చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ విధంగా ఆయన ప్రేక్షకులు సినిమా చూడటం కోసం థియేటర్లకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.