ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచానికి తగ్గట్టు కంపెనీలు ట్రెండీ బట్టలు, షూలు ఇలా అన్ని రకాలుగా మనుషులు వాడుకేనే దాంట్లో ట్రెండ్‌ను ఫాలో అవుతుంటాయి.అయితే ఇది ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటేనే బాగుంటుంది.
కానీ అతి చేస్తే చివరకు విమర్శల పాలు కావడం తప్పదు.ఆలోచన కొత్తగా ఉంటే తప్పులేదు గానీ చెత్తగా ఉండ కూడదని ఇప్పటికే ఎన్నో ఘటనలు నిరూపించాయి.
మనుషుల జీవన విధానాలను ప్రభావితం చేసే విధంగ ఆఉండే ఎలాంటి వస్తువులను అయినా మానవులు తిరస్కరిస్తారని తెలిసిందే.
ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఓ కంపెనీ దుస్తుల విషయంలో వింత పోకడలకు పోయింది.
ప్రముఖ బట్టల కంపెనీ అయిన గివెంచీ డిజైన్ చేసిన బట్టలపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో వీటని చూసిన నెటిజన్లు అయితే ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తూ వాటిపై దుమ్మెత్తిపోతున్నారు.
సమాజాన్ని ఎటువైపు నడిపించాలని అనుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.ఎందుకంటే వారు తయారు చేసిన బట్టలు అలా ఉన్నాయి మరి.
అదేంటంటే ఈ బట్టల్లో ఉరితాడును పోలిన డిజైన్‌ను రూపొందించారు.
![Telugu Neck, Netizens Angry, Chothes Disign-Latest News - Telugu Telugu Neck, Netizens Angry, Chothes Disign-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/10/The-company-that-designed-the-hanging-style-lobbiess.jpg )
ప్రతి డ్రెస్సుకు మెడ భాగంలో ఒక ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అటాచ్ చేస్తూ వదిలింది.అయితే ఈ నెక్లెస్ ఉరితాడును పోలి ఉంది.దీంతో ఈ బట్టలను ధరించి ఫేమస్ మోడల్స్ కూడా ర్యాంప్ వాక్ చేయగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలపై దారుణంగా ట్రోలింగ్ నడుస్తోంది.
సమాజానికి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని, జనాలను ఉరేసుకుని చనిపోమని చెబుతున్నారా అంటూ ప్రశ్నలు రావడంతో కంపెనీ దెబ్బకు దిగొచ్చింది.ఉరితాడులా డిజైన్ చేసిన దుస్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పడంతో పాటు ప్రజలకు సారీ కూడా చెప్పింది ఆ కంపెనీ.
ఇలా నెటిజన్ల ఆగ్రహానికి గురైందన్నమాట.