యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తొలి వారం ఎవరితో పెద్దగా కలవకపోయినా రెండో వారం నుంచి బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లతో కలవడంతో పాటు యాక్టివ్ గా ఉంటున్నారు.అయితే సిరి వల్ల షణ్ముఖ్ కు నష్టం జరుగుతోందని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణల వల్ల సిరి, షణ్ముఖ్ కలిసి గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
మరోవైపు వీజే సన్నీ సిరి షర్ట్ లో చేయి పెట్టకపోయినా పెట్టాడంటూ షణ్ముఖ్ సపోర్ట్ చేయడంతో షణ్ముఖ్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
సిరి వల్ల నష్టమే తప్ప లాభం జరగకపోవడంతో షణ్ముఖ్ తన ఆలోచనా తీరును మార్చుకున్నారు.షణ్ముఖ్ తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో జెస్సీతో మాట్లాడుతూ నాకు ఎక్కడో కొడుతుందని చెప్పుకొచ్చారు.
వరుసగా జరుగుతున్న ఘటనల వల్ల పరోక్షంగా తన సపోర్ట్ జెస్సీకి వెళుతోందని షణ్ముఖ్ కామెంట్లు చేశారు.
![Telugu Biggboss, Lobo, Siri, Swetha-Movie Telugu Biggboss, Lobo, Siri, Swetha-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/09/shanmukh-jashwanth-shocking-comments-bigg-boss-telegu-swetha.jpg)
సిరిని దూరం పెట్టడం మంచిదని తనకు అనిపిస్తోందని తాను బెడ్ మారిపోవాలని భావిస్తున్నానని షణ్ముఖ్ వెల్లడించారు.సిరి చాలా బ్యాడ్ అని సిరి సేఫ్ గేమ్ ఆడటం తనకు నచ్చడం లేదని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.సిరి నుంచి ఏదైనా ఎక్స్ పెక్ట్ చేశానంటే ఆ తప్పు తనదే అని షణ్ముఖ్ అన్నారు.
ఆ తర్వాత హౌస్ లొ శ్వేత లోబోతో క్లోజ్ గా ఉండగా షణ్ముఖ్ శ్వేతను ఏమైనా అంటే ఫేస్ పై పెయింట్ కొడుతుందని కామెంట్ చేశాడు.
![Telugu Biggboss, Lobo, Siri, Swetha-Movie Telugu Biggboss, Lobo, Siri, Swetha-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/09/shocking-comments-bigg-boss-telegu-swetha-lobo.jpg)
షణ్ముఖ్ చేసిన కామెంట్ వల్ల హర్ట్ అయిన శ్వేత అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత లోబో ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుకు రావడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.మరోవైపు ఈ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గత సీజన్లలా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ముందుగానే తెలిసిపోతూ ఉండటంతో బిగ్ బాస్ షోపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గుతోంది.