తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఎన్నో మెలోడీ సాంగ్స్ ను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొన్ని పరిస్థితుల కారణంగా చక్రి ప్రస్తుతం మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సంగీతం ఇప్పటికీ మనతో పాటు బ్రతికి ఉంటుంది.
ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించి ఎన్నో అవార్డులను అందుకున్న చక్రి మరణం తర్వాత ఆయన తమ్ముడు మహిత్ నారాయణ సినిమా ఇండస్ట్రీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగుపెట్టారు.చక్రి మరణించిన ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిత్ నారాయణ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా మహిత్ మాట్లాడుతూ అన్నయ్య చనిపోయిన ఎన్నో ఏళ్ల వరకు ఎవరైనా మా కోసం వస్తారు అని ఎదురు చూసాము.అయితే ఎవరు మమ్మల్ని పలకరించలేదు కానీ నా పనేదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మీద ఉన్న అభిప్రాయంతో ఆయన పుట్టిన రోజుకు ఒక స్పెషల్ సాంగ్ చేశాను ఆ పాట విన్న రామ్ చరణ్ నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి హక్కున చేర్చుకున్నారనీ రామ్ చరణ్ గురించి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
అయితే చాలామంది నేను ఏదో ఆశించి రామ్ చరణ్ కోసం ప్రత్యేక పాటను చేశానని భావించారు కానీ ఒక అభిమాని ఎప్పుడూ కూడా ఏమీ ఆశించడు.కానీ ఈ పాట విన్న తర్వాత రామ్ చరణ్ ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యారని నా భుజం పై అలా చేతులు వేసి నన్ను పలకరిస్తుంటే ఒక్కసారిగా.అన్నయ్య స్పర్శ గుర్తుకు వచ్చిందని.
అన్నయ్యే రామ్ చరణ్ చేత అలా చేయించారేమోనని ఆ క్షణం నాకు కలిగిన ఆ అనుభూతి మాటలలో వర్ణించలేనిదని చక్రి తమ్ముడు మహిత్ నారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఒక మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ నా స్థాయికి దిగి మాట్లాడాల్సిన అవసరం తనకులేకపోయినప్పటికీ తనలో ఏ మాత్రం మెగాస్టార్ కొడుకు అన్న గర్వం లేకుండా తనను పలకరించిన తీరు తన మనసుకి ఎంతగానో తాకిందని, ఆ ఘటన ఈ జన్మలో ఎప్పటికీ మరిచిపోలేని ఈ సందర్భంగా మహిత్ నారాయణ తెలియజేశారు.