కాబుల్: అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు లెక్కకుమించిన అరాచకాలు కొనసాగిస్తున్నారు.ముఖ్యంగా తాలిబన్లకు మహిళలు అంటే ఎంతో చిన్నచూపు.
పలు సందర్భాలలో మహిళలపై తమ జులుం చూపిస్తుంటారు.అయితే కొత్తగా ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వంలో తమకు కూడా ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేపట్టారు.
ఈ నేపధ్యంలో తాలిబన్లు.మహిళలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు.
మహిళలు కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కావాలని.వారు ఎన్నటికీ మంత్రులు కాలేరని వ్యాఖ్యానించారు.
మహిళలకు తమ ప్రభుత్వంలో చోటు కల్పించే ప్రశ్నే లేదన్నారు.మొదటి నుంచి మహిళలనే టార్గెట్ చేసుకున్న తాలిబన్లు.
వారి హక్కులకు భంగం కలిగిస్తున్నారు.ఇప్పుడు మహిళలు పిల్లలు కనడానికి మాత్రమే ఉపయోగపడతారంటూ తాలిబన్లు చేసిన వ్యాఖ్యలపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.కాబుల్ వీధుల్లో పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలను బెదిరించేందుకు తాలిబన్లు గాలిలోకి కాల్పులు జరిపారు.ఈ ఆందోళన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న విలేకరులను అరెస్ట్ చేశారు.
కాబూల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.
ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ జనసమీకరణ కోసం చేపడుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకే తాలిబన్లు ఇంటర్నెట్ సేవలను అడ్డుకున్నారు.తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా వందలాదిమంది మహిళలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేశారు.
ఆగస్టు 15 న తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అరాచకాలకు పాల్పడుతున్నారు.