చాలా మంది కుక్కలని, పిల్లులని, చిలుకలని, పావురాలని పెంచడం మనం చూస్తూనే ఉంటాం.ఇంకా కొంత మంది జింకలు, నెమళ్లను పెంచడం కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం.
కొంతమందికి పెట్స్ అంటే చాలా ఇష్టం.టైం దొరికితే చాలు వాటితోనే టైంపాస్ చేస్తుంటారు.
కానీ ఒకరి ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉంది.మన ఇంట్లో బల్లిని చూస్తేనే ఎక్కడ మీద పడుతుందో అని సడన్ గా బయపడుతాం.
అలాంటిది ఓ వ్యక్తి బల్లిని పెంచుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
పెంచుకుంటే పెంచుకున్నాడు.
అదేందో ఇంట్లో వరకు ఉంటే బాగుంటుంది.కానీ తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ బల్లిని కూడా తీసుకెళ్తాడు.
తనతో పాటు ఆ బల్లిని కూడా షికారుకు తీసుకెళ్తాడు.తాను వాకింగ్ కి వెళ్తే ఆ బల్లి మెడకు కూడా తాడు కట్టి దాని కూడా తీసుకెళ్తాడు.
ఇది చూసిన వారందరు షాక్ అవుతున్నారు.షాక్ అవ్వడం ఏంటి ఆ బల్లిని అలా చూసి చిరాకుగా, భయంగాగా, బేజారుగా అక్కడినుండి వెళ్ళిపోతారు.
జనాలు అలా భయపడడం చూసి ఆ వ్యక్తి నవ్వుకుంటాడు.
అయితే ఇది గోడల మీద కనిపించే బల్లి కాదు.ఈ బల్లిని యూఎస్ లోని ఫ్లొరిడాలో ఉండే ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు.ఇది బల్లి జాతికి చెందినదేనా అనే అనుమానం చాలా మందికి వచ్చింది.
అయితే ఇది బల్లి జాతికి చెందినదే.జురాసిక్ పార్క్ సినిమా డిలోఫోసారస్ ని చూశారు కదూ.అటువంటిదే ఇది.అచ్చం ఈ బల్లి కూడా ఇలాగే ఉంటుంది.కానీ ఇది డిలోఫోసారస్ కాదు.కానీ దాదాపు అలాగే ఉంటుంది.అయితే.ఈ బల్లి నోరు తెరిస్తే భయంకరంగా కనిపించినప్పటికీ.
ఆ బల్లి అంత డేంజర్ కాదంట.దాన్ని ఫ్రిల్డ్ డ్రాగన్ అని కూడా పిలుస్తారట.
ఆస్ట్రేలియా, న్యూగునియా లాంటి ప్రాంతాల్లో ఈ బల్లులు ఎక్కువగా తిరుగుతుంటాయి.