టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇప్పటికే పలు సినిమాలలో షూటింగ్ లో నటిస్తుండగా మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కానీ మళ్లీ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు ప్రభాస్.
కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ టి సిరీస్ నిర్మాణంలో గోపి కృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.రొమాంటిక్ పీరియాడికల్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంగా రూపొందుతోందని తెలుస్తోంది.
ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ చివరగా నటించిన సాహో తర్వాత మళ్లీ ఏ సినిమాలు తెరపైకి రాలేవు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు.
కోవిడ్ కారణంగా వాయిదా పడుతూనే ఉంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఈ సినిమాతో పాటు సలార్, ఆది పురుష్ సినిమాలో కూడా నటిస్తుండగా ఈ సినిమాల అప్ డేట్ లు మాత్రం బాగా వస్తున్నాయి.ఇక రాధేశ్యామ్ ప్రమోషన్స్ అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఒకవేళ అప్పుడు కూడా కోవిడ్ ప్రభావం ఉంటే మాత్రం విడుదల డేట్ మారుతుందని తెలిపారు.ఇక ఈ సినిమా తర్వాతనే సలార్, ఆది పురుష్ సినిమాలు విడుదల కానున్నాయని గతంలో తెలిపారు.మొత్తానికి ఒకటే ఏడాదిలో మూడు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్.