నటసింహ నందమూరి బాలకృష్ణ నుంచి సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవు.అందులోనూ బోయపాటితో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి.‘ సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ‘.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య‘.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇందులో ‘రామ్ చరణ్‘ ప్రత్యేక పాత్ర నటిస్తున్నారు.
నిజానికి అంతా సజావుగా సాగితే ఈ చిత్రం మే 13 విడుదల కావాల్సి ఉంది.అయితే కొరొనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ కు ఆటంకం కలిగింది ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో రిలీజ్ డేట్ ఎప్పుడు అంటుందన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.టాలీవుడ్ లో బారీ సినిమాలు వరుస విడుదల తేదీని ప్రకటించేశాయి.2022 సంక్రాంతి కి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలు ఖరారు చేశారు.‘ఆర్ ఆర్ ఆర్‘ ను అక్టోబర్ 13న విడుదల చేస్తామన రాజమౌళి ఇదివరకే చెప్పారు కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ ను సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదే గనుక జరిగితే బాక్సాఫీసు వద్ద టాలీవుడ్ లో బిగ్ బార్ జరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
ఇక సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య‘ బాలకృష్ణ చిత్రం ‘అఖండ‘ రిలీజ్ విషయంలో ఎటూ తేల్చుకోకుండా ఉన్నారు.రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్‘ విడుదల మనసు మార్చుకుంటే ఆ టైంలో ఆచార్య అఖండ విడుదలకు మార్గం సుగమం అవుతుంది.రెండు సినిమాలు అక్టోబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట అఖండ అక్టోబర్ 8న రిలీజ్ అయితే ‘ఆచార్య’ అక్టోబర్ 12న లేదా 13న రిలీజ్ కావచ్చు.
ఈ వార్తలు నిజమైతే బాలకృష్ణ చిరంజీవి మధ్య దసరా వార్ మొదలైనట్లే.చిరంజీవి బాలకృష్ణ మధ్య చివరగా 2017 సంక్రాంతి కి విడుదల పోటీ జరిగింది.చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి రెండు సినిమాలు విడుదలైతే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు మళ్లీ ఈసారి దసరా పండుగకు మెగా నందమూరి హీరోలు ఫైట్స్ చేయబోతున్నారు.
మరి ఈ చిత్ర నిర్మాతలు ఏ తేదీన విడుదల చేస్తారో వేచి చూడాలి.