వీడియో వైరల్: ఆక్టోపస్ నడుస్తుందా..?

మన సృష్టిలో ఒక్కో ప్రాణి ఒక్కోలా ఉంటుంది.ప్రతీ ఒక్కదానికి ఒక్కో తరహా జీవన శైలి ఉంటుంది.

 Viral Video, Viral Latest, Flash Viral, Social Media, Octopus , Walking, Men,lat-TeluguStop.com

పాములు నడవలేవు.జంతువులు పాక్కుంటూ వెళ్ళలేవు.

మనుసులు ఎగరలేరు.కానీ, ఓ ప్రాణీ మాత్రం తన స్వతహా స్వబాన్ని వీడి ఇంకోలా నడిచి అందరూ షాక్ అయ్యేలా చేసింది.

ఇంత వరకు ఎక్కడ జరగని ఓ వింత చేసి చూపించింది.అచ్చం మనిషిలా నడిచింది.

ఆ ప్రాణి ఏంటి అంటే ఆక్టోపస్.అవును మీరు విన్నది నిజం.ఆక్టోపస్ అచ్చం మనిషిలా రెండు కాళ్లతో నడుకుంటూ వెళ్ళిపోయింది.బ్యూటెన్‌ గెబీడెన్ అనే యూజర్ ఈ విషయాన్ని గమనించి వెంటనే తన ఫోన్ లో షూట్ చేశాడు.

అతడు వీడియో తీస్తుండగానే ఆక్టోపస్ మనిషిలాగా రెండు కాళ్లతో చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయింది.ఈ వీడియో తీసిన ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

మనిషికి రెండు కాళ్ళు ఉన్నట్టు.ఆక్టోపస్‌ కి 8 కాళ్ళు ఉంటాయి.అవి నీళ్లలో ఉంటాయి.నిజానికి ఆక్టోపస్ లు చాలా తెలివైనవి.చుట్టూ ఉన్న పరిసరాలను చూసి అవి చాలా నేర్చుకుంటాయి.ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే దాన్నుంచి తప్పించుకోవాటానికి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఉంటాయి.

మనకు చేతులు, కాళ్లు ఎలాగో ఆక్టోపస్‌ కి టెంటకిల్స్ అలాగా.వాటిని అవి కాళ్లు, చేతుల లాగా వాడుకుంటాయి.

వాటితోనే వస్తువుల్ని పట్టుకుంటాయి.అవి నడవలేవు.

కానీ ఈ ఆక్టోపస్ మాత్రం మనుషుల నుండి నడవడం నేర్చుకుందా అన్నట్టు రెండు కాళ్లతో చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయిన ఈ వీడియోని ట్విట్టర్‌ లో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు.ఆక్టోపస్ వెనక వ్యక్తి వీడియో తీస్తుంటే.

అది పారిపోతూ ఉన్నట్లుగా ఈ వీడియోలో ఉంది.ఈ వీడియో చూసిన వాళ్ళు ఆక్టోపస్ నడవడం చూసి ఆశ్చర్య పోయారు.

మరి మీరు ఆక్టోపస్ నడవడం చూడకుంటే ఇప్పుడే చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube