మనవుని శరీరంలో కొన్ని అవయవాలు మాత్రమే బయటకు కనిపిస్తాయి.మరికొన్ని అవయవాలు శరీర అంతర్భాగంలో ఉంటాయి.
అయితే బయటకు కనిపించే అవయవాల్లో ఎటువంటి తేడా ఉన్నాగాని మనకు అర్ధం అవుతుంది.కానీ లోపల అంతర్భాగంలో ఉన్న అవయవాల్లో ఉన్న తేడా గురించి మనకి తెలియదు.
పుస్తకాల్లో చదివితేనో లేక డాక్టర్లు చెబితేనో గాని మనకు మన శరీరంలో ఉన్న అవయవాల గురించి తెలియదు.ఉదాహరణకు మనకి గుండె అనేది ఒక్కటే ఉంటుందని, అది ప్రతి మనిషికి ఎడమ వైపు భాగంలో మాత్రమే ఉంటుందనే విషయం డాక్టర్లు చెబితే గాని తెలియదు కదా.ఒకవేళ మనం లోపలి శరీర భాగాల్లో ఏదైనా లోపం వున్నట్లయితే స్కానింగ్ వంటివి చేస్తే కాని లోపల అవయవాల్లో ఉన్న లోపాలు మనకు తెలియవు.ఎందుకంటే లోపల అవయవాలు మనకి కనిపించవు కావున.
అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం తెలిస్తే మీరే షాక్ అవుతారు.సాధరణంగా గుండె అనేది అందరికి ఎడమ వైపు ఉంటుంది కదా కానీ ఒక మహిళకు మాత్రం గుండె కుడివైపు ఉంది.
ఇంకో విచిత్రం ఏంటంటే తనకి గుండె కుడి వైపు ఉన్న సంగతి 19 ఏళ్లుగా ఆ మహిళకు తెలియదట.అలాంటి వింత ఘటన అమెరాకాలోని చికాగోకు చెందిన క్లెయిర్ మాక్ కు ఎదురయింది.
క్లెయిర్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతుందట.దగ్గు తగ్గించుకునేందుకు ఎన్నో రకాల టాట్లెట్లు, సిరప్ లు వాడుతున్నా కానీ దగ్గు మాత్రం తగ్గడం లేదని ఆసుపత్రికి వెళ్ళింది.
రెండు నెలలుగా దగ్గు తగ్గకపోవడానికి ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఉందేమో అని సందేహంతో డాక్టర్ ఎక్సరే తీయించాడు.తీరా ఎక్సరే వచ్చాక అది చూసి డాక్టర్ అవాక్ అయ్యాడు.

ఎక్సరే పరిశీలించిన వైద్యుడు క్లెయిర్ శరీరంలో ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడివైపు ఉన్నట్లు గుర్తించాడు.ఇదే విషయాన్ని క్లెయిర్ కు తెలియజేశాడు.మీకు దగ్గు రావడానికి, గుండె కుడివైపు ఉండటానికి ఎలాంటి సంబంధం లేదని, భయపడాల్సిన అవసరం లేదని క్లెయిర్ కు చెప్పాడు.అయితే ఇలా ప్రపంచంలో కుడివైపు గుండెతో జన్మించడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇలా కుడివైపు గుండె ఉండటాన్ని డెక్స్ ట్రాకార్డియా అంటారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన శరీరంలో కుడివైపు గుండె ఉన్న విషయం 19ఏళ్ళుగా క్లెయిర్ కు తెలియకపోవడమే.గుండె కుడి వైపు ఉన్నాగాని క్లెయిర్ ఇన్నేళ్ళుగా ఎలాంటి సమస్య లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉంది.ఈ విషయం తెలిసిన క్లెయిర్ తనకు గుండె కుడి వైపు ఉంది అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికి చెప్పడంతో విషయం బయటపడింది.