సెకండ్‌ డోస్‌ టీకాతో సైడ్‌ఎఫెక్ట్స్‌ ముప్పు?

సెకండ్‌ డోస్‌ కరోనా టీకా తీసుకుంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు.మొదటి డోస్‌ కంటే రెండో డోస్‌ టీకాతో నొప్పితోపాటు రియాక్షన్‌ కూడా ఎక్కువే ఉంటుందట.

 Side Effects Severe With Second Dose , #corona Vaccine, Corona Side Effects, Se-TeluguStop.com

దీని వల్ల మీ రోజువారీ పనులను రెండు రోజులపాటు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.సెకండ్‌ కరోనా టీకా తప్పకుండా తీసుకోవాలి.

అప్పుడే వ్యాక్సిన్‌ పూర్తవుతుంది.దాదాపు ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని టీకాలు రెండు డోసులవే! మొదటి టీకా తీసుకుంటే శరీరంలో యాంటీబాడీస్‌ను బిల్డ్‌ చేస్తుంది.

రెండో డోస్‌ టీకాతో మెమోరీ సెల్స్‌ కూడా పనిచేసి, యాంటీబాడీస్‌ను మరింత పటిష్టం చేస్తాయి.ఫస్ట్‌ డోస్‌ టీకాతో ఇమ్యూన్‌ సిస్టం కూడా బూస్ట్‌ అవుతుంది.

ఇదే ప్రధాన కారణం.అందుకే మొదటి డోస్‌ కంటే రెండో టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

Telugu Coronavaccine, Corona Effects, Dose, Effectssevere-Latest News - Telugu

ముఖ్యంగా కరోనా టీకా ఇతర టీకాల కంటే డిఫరెంట్‌.అందుకే ఇలా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇతర టీకాలతో తక్కువ ఇన్ఫెక్షన్‌ వచ్చే ఆస్కారం ఉంటుంది.కానీ, కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్ఫెక్షన్‌ బాధ ఎక్కువగా ఉండవచ్చు.ఇది అందరిపై ఒకే విధంగా ఉండకపోవచ్చు.ఎందుకంటే ఇది వారి ఇమ్యూన్‌ సిస్టం పై ఆధారపడి పనిచేస్తుంది.

కొంతమందిలో ఈ సైడ్‌ఎఫెక్ట్స్‌ తీవ్రంగా ఉంటాయి.ఇది ఆడవారిలో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది.

వారి జెనిటిక్స్, హార్మోనల్‌ మార్పులు కూడా వీటికి కారణం.ఆడవారిలో రుతుచక్రంలో మార్పులు, కడుపులో నొప్పి ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌కు దారితీస్తుంది.

ఇటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ వారికి మొదటిసారి తీసుకున్నపుడు ఉండదు.కరోనా వచ్చి తగ్గిన వారిలో ఈ సైడ్‌ఎఫెక్స్‌›్ట ప్రభావం మిగతావారి కంటే.

ఎక్కువ గా ఉంటుందని కొన్ని కొత్త నివేదికల ద్వారా తెలిసింది.ఇది వారిని ఎక్కువ రోజులు కూడా వేధించవచ్చు.

ఇది కేవలం కరోనా వచ్చినందుకే ఈ ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటుంది.సైడ్‌ఎఫెక్ట్స్‌లో భాగంగా ఫ్లూ లాంటి జ్వరం మొదటి డోస్‌ మాదిరిగానే ఉంటుంది.

కానీ, సైడ్‌ ఎఫెక్స్‌›్ట ప్రభావం మాత్రం రెండింటిలో తేడా ఉంటుంది.టీకా తీసుకున్నప్పటి నుంచి కాస్త జ్వరం, తల తిప్పినట్లు వంటి లక్షణాలు ఉంటాయి.

అలసిపోయినట్లుగా ఉంటుంది.రెండో డోస్‌ తీసుకున్న కొంతమందిలో వాంతులు కూడా అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి.

ఇటువంటి ఎక్కువ రెస్ట్‌ తీసుకోవడం మంచిది.డోస్‌ తీసుకునే ముందురోజు రాత్రి ఎక్కువసేపు నిద్రపోవాలి.

నీరు కూడా ఎక్కువ తాగాలి.ఓ రెండు రోజులు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సమయం కేటాయించడం మంచిది.

తద్వారా పూర్తిగా కోలుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube