మనలో చాలామంది వినోదం కోసం సినిమాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతాం.మన ఫేవరెట్ హీరో సినిమాలోని పాటల్లో మరో స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ కూడా కనిపిస్తే మన సంతోషానికి అవధులు ఉండవు.
ఇండస్ట్రీలో చాలామంది హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ఆ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడానికి కారణమయ్యారు.చిరంజీవి హీరోగా వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో చరణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు.చరణ్, చిరంజీవి కలిసి వేసిన స్టెప్పులను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోయారు.
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని నా పేరే కాంచనమాల పాటలో శ్రీకాంత్ నోటిలో మందు పోస్తూ పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.విక్టరీ వెంకటేష్, అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన చింతకాయల రవి సినిమాలో సరదాకే సరాదే పుట్టే పాటలో ఎన్టీఆర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

తరుణ్ హీరోగా తెరకెక్కిన సోగ్గాడు సినిమాలోని కొక్కరకో పాటలో శ్రియ కొన్ని సెకన్ల పాటు కనిపించి సందడి చేశారు.అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటలో కమెడియన్ బ్రహ్మనందం కొన్ని సెకన్ల పాటే కనిపించిన స్టెప్పులు అద్భుతంగా వేశారు.రానా హీరోగా తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలోని స్పెషల్ సాంగ్ లో వెంకటేష్ మెరిశారు.అఖిల్ హీరోగా తెరకెక్కిన “అఖిల్” సినిమాలో నాగార్జున అక్కినేని అక్కినేని పాటలో కొన్ని నిమిషాల పాటు కనిపించారు.