మన దేశంలో చాలా మంది కుక్కలను పెంచుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.కానీ ఒక చోట మాత్రం వింతగా కుక్కలను గుడిలో పెట్టి పూజిస్తారు.
ఇలాంటి వింత ఆచారం పాటించేది ఎక్కడంటే.భారత్ లోని మధ్యప్రదేశ్ రాష్ర్టంలో ఈ ఆలయం ఉంది.
అంతే కాకుండా ఈ ఆలయానికి పేరు కూడా ఉంది.అదే కకూర్ మందిర్.
ఈ పేరుకు సంస్కృతంలో కుక్కల గుడి అనే అర్థం వస్తుంది.కుక్క కోసం కట్టడం మూలాన ఈ దేవాలయానికి అలా పేరు వచ్చిందట.
ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు.ఎప్పుడో 10 వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ ఎక్కువగా గిరిజన తెగల వాళ్లు వచ్చి పూజలు చేస్తారట.
ఈ ఆలయం ఎందుకు నిర్మించారనే విషయంలో ఓ స్టోరీ కూడా ప్రచారంలో ఉంది.
ఆ స్టోరీ ప్రకారం… పూర్వపు రోజుల్లో ఒక వ్యక్తి తనకున్న కుక్కను తాకట్టుగా పెట్టి అప్పు తీసుకున్నాడట.తర్వాత రోజుల్లో కుక్కు అప్పు ఇచ్చిన వాళ్లకు చేసిన సాయానికి వారు ఆనందపడి కుక్కను తాకట్టు నుంచి వదిలేశారు.
కానీ కుక్క యజమాని ఆ ప్రాంతంలో ఉండక పోవడంతో వారు బాగా ఆలోచించి… జరిగిన విషయాన్ని ఓ ఉత్తరంలో రాసి.ఆ ఉత్తరాన్ని కుక్క మెడలో వేసి వదిలిపెడతారు.

దీంతో ఆ కుక్క తన యజమాని వద్దకు వెళ్తుంది.కానీ కుక్కను అపార్థం చేసుకున్న సదరు యజమాని అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడి దానిని చంపుతాడు.తర్వాత అసలు జరిగిన విషయం తెలుసుకున్న యజమాని కుక్కను చంపినందుకు బాధపడి… కుక్కకు ఓ గుడి కట్టించాడట.అంతే కాకుండా ఝాన్సీ జిల్లాలో మరో కుక్కల గుడి ఉంది.
విజ్ఞాన శాస్త్రం ఇంతలా డెవలప్ అయిన ఈ రోజుల్లో కుక్కలను పూజించడమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.