సురేఖ వాణి కూతురు సుప్రీత నేడో రేపో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే విషయమై సురేఖ వాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
తనకు ఇష్టం అయితే నటిస్తే తాను అడ్డు చెప్పను.తన ఇష్టానుసారంగా తాను వ్యవహరిస్తాను అంటూ పేర్కొంది.
సురేఖ వాణి కూతురు గా సుప్రీత మంచి పేరును దక్కించుకుంది.సోషల్ మీడియాలో సుప్రీతకు హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.
అందుకే ఆమె త్వరలోనే హీరోయిన్ అవ్వడం ఖాయం అన్నట్లుగా అంతా నమ్మకంగా చెబుతున్నారు.ఇక సుప్రీత సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది.
ఆమె తాజా చిట్ చాట్ లో ఆసక్తికర విషయాన్ని బోల్డ్ గా వెళ్లడించి అందరిని ఆశ్చర్యపర్చింది.ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సుప్రీత తాజా లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది.ఆ సందర్బంగా మీకు ఏదైనా సమయంలో బోర్ ఫీల్ అవుతుందా.ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ప్రశ్నించారు.అందుకు సుప్రీత నుండి షాకింగ్ ఆన్సర్ వచ్చింది.ఎప్పుడైతే నేను వైన్ తాగుతానో అప్పుడు నాకు ఒంటరి తనం అనిపిస్తుంది.ఆ సమయంలో తోడు గురించిన ఆలోచన వస్తుందని బోల్డ్ గా చెప్పేసింది.
తాగడం గురించి మాట్లాడటమే చాలా అరుదుగా జరుగుతుంది.అలాంటిది సుప్రీత తాను వైన్ తాగుతాను తాగిన సమయంలో ఒంటరి తనం గురించి ఆలోచిస్తాను అంటూ వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆమె బోల్డ్ తనంకు నిదర్శణంగా చెప్పుకోవచ్చు.
తెలుగు బుల్లి తెరపై ఇప్పటికే పలు సందర్బాల్లో కనిపించిన సుప్రీత వెండి తెర అరంగేట్రం కోసం సురేఖ వాణి అభిమానులు మరియు సన్నిహితులు వెయిట్ చేస్తున్నారు.