నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తట్టుకోలేక మహిళలు ఎన్నో ఇబ్బందు పడుతుంటారు.ఈ నెప్పులకు కారణం హార్మోన్ల మాయాజాలమే.
నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు సాధారణంగానే తగ్గిపోతాయి.దాంతో నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్లూ, చేతులూ లాగడం.
వంటి సమస్యలు ముప్ప తిప్పలు పెడతాయి.దీంతో చాలా మంది పెయిర్ కిల్లర్స్ వేసుకుంటారు.
కానీ, పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు.అందుకే న్యాచురల్ పద్ధతుల్లో నెలసరి నొప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
అయితే నెలసరి నొప్పులను సులభంగా నివారించడంలో చామంతి టీ అద్భుతంగా సహాయపడుతుంది.నిజానికి ప్రపంచవ్యాప్తంగా మనకు ఎన్నో టీలు అందుబాటులో ఉన్నాయి.వాటిలో చామంతి టీ కూడా ఒకటి.కానీ, చాలా మందికి చామంతి టీ ఉందనే విషయమే తెలియదు.
గడ్డి లేదా సీమ చామంతి పూలతో ఈ టీని తయారు చేస్తారు.ఈ చామంతి రుచిగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.,/br>

ముఖ్యంగా నెలసరి సమయంలో వేడి వేడిగా ఒక కప్పు చామంతి టీ తాగితే అందులో ఉండే ఔషధ గుణాలు గర్భాశయ కండరాలను శాంతింప చేస్తాయి.దాంతో నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్లూ, చేతులూ లాగడం వంటి సమస్యలు మటుమాయం అవుతాయి.అంతేకాదు, చామంత టీ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు పరార్ అవుతాయి.
బరువు కూడా తగ్గుతారు.
అందుకే చామంతి టీని ఎవ్వరైనా తీసుకోవచ్చు.
మరి ఇంతకీ చామంతి టీ ఎలా తయారు చేసుకోవాలంటే.ముందుగా వాటర్‌ను లైట్‌గా హిట్ చేసి ఆ తర్వాత అందులో ఎండబెట్టుకున్న చామంతి పూలు మరియు బెల్లం తురుము వేసి మరిగిచుకోవాలి.
అనంతరం వడపోసి నిమ్మరసం కలిపితే చామంతి టీ సిద్ధమైనట్టే.ఇక మార్కెట్లో కూడా చామంతి టీ బ్యాగుల రూపంలో లభిస్తాయి.
ఇవి కూడా మీరు వాడుకోవచ్చు.